newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

అతి పెద్ద ఫిలిం స్టూడియో కట్టబోతున్న మెగాస్టార్??

18-10-202018-10-2020 09:04:56 IST
Updated On 18-10-2020 09:27:13 ISTUpdated On 18-10-20202020-10-18T03:34:56.482Z18-10-2020 2020-10-18T03:34:53.800Z - 2020-10-18T03:57:13.082Z - 18-10-2020

అతి పెద్ద ఫిలిం స్టూడియో కట్టబోతున్న మెగాస్టార్??
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. చాలా సినిమాలు షూటింగ్స్ కి వేరే దేశాలకు, వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల బయటకు వెళ్లి షూటింగ్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. షూటింగ్స్ ఏమున్నా, ఖర్చు ఎక్కువైనా సరే ఇక్కడే ఫిలిం స్టూడియోలలో సెట్ లు వేసుకొని చేసుకుందామని సినీ పరిశ్రమ అనుకుంటుంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కొన్ని చోట్లే సినీ స్టూడియోలు ఉన్నాయి. మన హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ దేశంలోనే అతి పెద్ద సినీ స్టూడియో. ప్రస్తుతం కరోనా వల్ల అందరు స్టూడియోలోనే షూటింగ్స్ జరుపుకుందాము అనుకోవడంతో ఫిలిం స్టూడియోలకి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా మంది స్టూడియో నిర్మాణాలు చేపడుతున్నారు. 

హైదరాబాద్ లో ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో... ఇలా ఇంకా కొన్ని చిన్న చిన్న స్టూడియోలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే చాలా సినిమాలు, టీవీ షోస్, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వైజాగ్ లో కూడా నిర్మాత సురేష్ బాబుకి సంబంధించి ఒక స్టూడియో ఉంది. ఇప్పుడు కొత్తగా తెలుగు పరిశ్రమ నుంచే చాలా కొత్త స్టూడియోలు రాబోతున్నాయి. ఇటీవలే పోసాని కృష్ణమురళి ఆంధ్రాలో ఫిలిం స్టూడియో కడతానని ప్రకటించారు. ఏపీలోనే ఓ ప్రముఖ ఎంపీ కూడా వైజాగ్ లో సినీ స్టూడియో కట్టబోతున్నాడని సమాచారం. ఇటు హైదరాబాద్ లో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ ని కడుతున్నారు. ఇటీవలే ఈ అల్లు స్టూడియోస్ కి శంకు స్థాపన కూడా చేశారు.                                 

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ బ్రహ్మండమైన స్టూడియోను నిర్మించబోతున్నారనే వార్తలు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. ఆయన కుటుంబం మొత్తం సినీ పరిశ్రమలోనే ఉన్నారు. చిరు తనయుడు రామ్ చరణ్, కూతురు సుస్మిత ఇప్పటికే నిర్మాతలుగా మారి మంచి సక్సెస్ లో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయనకు ఉన్న పదెకరాల స్థలంలో ఒక ఫిలిం స్టూడియోను ప్రారంభించబోతున్నారు అని సమాచారం.

ఈ స్టూడియో రామోజీ ఫిలిం సిటీని మించి ఉండబోతుందని, అన్ని హంగులతో, అన్ని రకాలుగా అనువుగా ఉండబోతుందని అనుకుంటున్నారు. ఇందులో టీవీ షోస్ కోసం ప్రత్యేకంగా నాలుగు ఫ్లోర్లు కూడా నిర్మిస్తారని, ఇండోర్ షూటింగ్స్, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, మినీ ఈవెంట్స్ జరపుకునే వీలుగా ఈ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసినట్టు చిరంజీవి సన్నిహితులు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవర్ని పిలవకుండా అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారని అందుకే చిరు కూడా తానేంటో చూపించాలని అల్లు స్టూడియోస్ కి పోటీగా స్టూడియో కట్టబోతున్నారని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమలో అన్ని రకాలుగా సక్సెస్ సాధించిన మెగాస్టార్ ఇప్పుడు స్టూడియో కూడా కట్టి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తున్నారు.       


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle