newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా ప్లాస్మా దానం..

29-09-202029-09-2020 12:50:52 IST
Updated On 29-09-2020 13:04:18 ISTUpdated On 29-09-20202020-09-29T07:20:52.768Z29-09-2020 2020-09-29T07:20:50.136Z - 2020-09-29T07:34:18.659Z - 29-09-2020

మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా  ప్లాస్మా దానం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా కాలంలో ఎంతో మంది సెలెబ్రిటీలు తమకు తోచినంతలో పేదవాళ్ళకి దానాలు చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా టైంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసారో మనందరికీ తెలిసిందే. కరోనా వల్ల నాలుగు నెలలకు పైగా షూటింగ్స్ లేవు. అలంటి టైంలో సినీ పరిశ్రమలో చాలా మంది రోజు వారి కార్మికులు రోడ్డున పడ్డారు. అలాంటి వాళ్లందరికీ మెగాస్టార్ చేయూతనిచ్చారు. కరోనా కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఓ సంస్థని స్థాపించి సినీ పరిశ్రమలో ఉన్న రోజు వారి కార్మికులకు నిత్యావసరాలు అందచేశారు. సినీ పరిశ్రమలోని సెలెబ్రిటీలందరిని ఒకచోటికి చేర్చి వారందరితో కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం చేసేలా చేశారు. ఈ పనికి అందరూ చిరంజీవినిని ఎంతో పొగిడారు.  

ఇప్పుడు కరోనా టైంలోనే కాక అంతకు ముందు నుంచి కూడా చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలని చేశాడు. ఎన్నో దానాలు చేశాడు. చిరంజీవి తన సొంత నిధులతో బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి రక్తం దానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఇప్పటికి ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఇంకా ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నారు. 

ఇన్ని సహాయాలు చేస్తూ తాజాగా పేద ప్రజలకు మరో సాయం చేయడానికి ముందుకు వచ్చారు చిరంజీవి. పేద కరోనా రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేయాలని నిర్ణయించారు. కరోనా బారిన పడి నిస్సహాయులైన పేద రోగులకు ఉచితంగా ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి.

తెల్ల రేషన్ కార్డులు ఉండి, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ఉచితంగా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్లాస్మా సరఫరా చేస్తున్నామని దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చిరు తెలిపారు. ఈ కష్టకాలంలో ప్లాస్మా దొరక్క ఇబ్బందిపడే పేదవాళ్లకు చిరు అండగా నిలిచి భరోసా ఇవ్వడం గొప్ప విషయం అని అభిమానులు, ప్రజలు అంటున్నారు.   


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle