newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

చిరు ఆచార్య షూటింగ్ ఎప్పుడు..? ఎక్కడ..?

18-10-202018-10-2020 14:39:10 IST
Updated On 18-10-2020 14:52:51 ISTUpdated On 18-10-20202020-10-18T09:09:10.782Z18-10-2020 2020-10-18T09:08:41.626Z - 2020-10-18T09:22:51.665Z - 18-10-2020

చిరు ఆచార్య షూటింగ్ ఎప్పుడు..? ఎక్కడ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక కీలక పాత్రలో రామ్ చరణ్‌ నటిస్తుండడం విశేషం. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా..? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరు షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇంకా టైమ్ పడుతుందట. అందుకని చిరు లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇంతకీ.. ఎక్కడ షూటింగ్ చేయనున్నారంటే... రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వర్క్ ను వేస్తున్నారని.. ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయం సెట్ ను వేయడం దాదాపు పూర్తి చేశారని తెలిసింది. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు.

 ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయనున్నారంటే... నవంబర్ నుంచి అని సమాచారం. వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle