newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

మంచి మనోజ్

22-11-202022-11-2020 17:40:26 IST
2020-11-22T12:10:26.084Z22-11-2020 2020-11-22T12:10:21.381Z - - 06-12-2020

మంచి మనోజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అప్పుడప్పుడూ కొన్ని తింగర మాటలు మాట్లాడినా.. కాస్త ఓవర్ చేస్తున్నాడు అనిపించినా.. మంచు వారి చిన్నబ్బాయి చాలా మంచోడు. తన సినిమాలే కాదు. తన మాటలు కూడా ఎప్పుడూ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు కూడా తన మంచితనం చాటుకున్నాడు మంచు మనోజ్.

గ్రీన్ చాలెంజ్ లు గట్రా వెంట వెంటనే చేసే హీరోలు.. స్టార్లు.. మంచి పనులు చేయాలంటే కాస్త ఆలోచిస్తారు. ఒక్క మొక్కతో పోయేదైతే ఓకే కానీ.. ఒక మొక్కలాంటి మనిషి ప్రాణాలు కాపాడ్డానికి పెద్దగా ముందుకు రారు.   మంచు మనోజ్ మాత్రం అలా కాదు అని నిరూపించుకున్నాడు. గ్రీన్ చాలెంజులు.. విషెస్ లు గట్రా చెప్పడానికి కాస్త దూరంగా ఉంటాడు కానీ.. ఓ బాబుకి సాయం చేయాలి.. ఓ చిన్ని ప్రాణాన్ని కాపాడాలి అని తెలియగానే.. నేన్ రెడీ. ఐయామ్ హియర్ మ్యాన్.. మీరేం బాధ పడకండి. నేన్ చూసుకుంటా అన్నాడు. పుణ్యం మొత్తం సోనూసూదే మూట గట్టుకోవాలా.. నేనూ కాస్త తీసుకుంటా.. అందులో భాగంగానే ఆ పిల్లాడి హాస్పిటల్ ఫీజు తీసుకుంటా.. డీటెయిల్స్ నా ఇన్  బాక్స్ కి పంపండి అన్నాడు. 

ఓ ఆటో డ్రైవర్ కుమారుడికి బోన్ క్యాన్సర్ అట. ఆటో డ్రైవర్ బోన్ క్యాన్సర్ ఉన్న కొడుకుని కాపాడుకోలేస్తాడా చెప్పండి. అందుకే.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ వాళ్లు.. సోనూ సూద్ కి రిక్వస్ట్ చేశారు. అది చూసిన మంచు మనోజ్.. ఈ బాబుని నేన్ చూసుకుంటాలే. డీటెయిల్స్ నాకు పంపండి అని.. మంచి మనసు చాటుకున్నాడు ఈ మంచు వారి చిన్నబ్బాయి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle