newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

టెన్షన్ లో మహేష్‌. మేటర్ ఏంటి..?

12-10-202012-10-2020 10:57:33 IST
2020-10-12T05:27:33.530Z12-10-2020 2020-10-12T05:27:31.423Z - - 21-10-2020

టెన్షన్ లో మహేష్‌. మేటర్ ఏంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ మహేష్ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని త్వరలో అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. లోకేషన్స్ చూడడం కోసం పరశురామ్ టీమ్ అమెరికా వెళ్లారు. తర్వాత మహేష్ బాబు టీమ్ కూడా అమెరికా వెళ్లనుందని వార్తలు వచ్చాయి. అయితే.. కరోనా కారణంగా అమెరికాలో షూటింగ్ చేయడం కుదరడం లేదట. అంందుకనే సినిమా వాళ్లు ఇటలీలో షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు.

అమెరికాలో షూటింగ్ చేయడం కుదరకపోవడంతో జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అయితే... ఈ మూవీ ఆలస్యం అవుతుండడంతో త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మహేష్ కి ఓకే. త్రివిక్రమ్ రెడీగానే ఉన్నారు. ఇక్కడే రెండు సమస్యలు ఉన్నాయి. ఏంటంటే... త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేయాలంటే... ఎన్టీఆర్ ఓకే అనాలి. అందేంటి అనుకుంటున్నారా..? అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమాని ఎన్టీఆర్ ఎనౌన్స్ చేసారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం అవ్వడం వలన లేట్ అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే ఎన్టీఆర్. త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లేది. మరి.. ఎన్టీఆర్ ఒకే అంటారా..? లేదా..? ఈ సమస్య ఓకే అయితే... పరశురామ్ తో ఓ సమస్య. ఏంటంటే... పరశురామ్ నాగచైతన్యతో మూవీ ప్లాన్ చేసుకుంటే... మహేష్ కోసం పరశురామ్ వచ్చేసాడు. అలాంటిది ఇప్పుడు పరశురామ్ ని పక్కన పెట్టి త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తే.. పరశురామ్ ఏమనుకుంటాడు..? ఇండస్ట్రీలో ఏమనుకుంటారు..? అనేది మరో సమస్య. ఈ కారణాలతో మహేష్ టెన్షన్ లో ఉన్నాడని అంటున్నారు. మరి... ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle