newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

లెక్క‌లు మార‌తాయా

25-10-202025-10-2020 14:50:48 IST
Updated On 25-10-2020 14:52:45 ISTUpdated On 25-10-20202020-10-25T09:20:48.868Z25-10-2020 2020-10-25T09:20:39.852Z - 2020-10-25T09:22:45.214Z - 25-10-2020

లెక్క‌లు మార‌తాయా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే  ఆ లెక్క వేరే. జ‌స్ట్ అలా న‌డిచొస్తే చాలు. ఆ టీజ‌ర్ రికార్డులు బ్రేక్ చేస్తుంది.  జ‌స్ట్ ఒక ట్వీట్ చేస్తే చాలు.. ఆ  రికార్డులు వేరే ఉంటయ్. ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే.. సినిమాల‌న్నీ దారిచ్చి.. థియేట‌ర్స్ కి  ఇన్వైట్ చేస్త‌య్ అలాంటి ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. ఎప్పుడూ ఏడాదికో రెండేళ్ల‌కో సినిమా చేసే ప‌వ‌న్ కల్యాణ్‌.. ముప్పై రోజుల గ్యాప్ దొరికింది.. సినిమా చేద్దాం అని డైరెక్ట‌ర్ల‌కీ.. ప్రొడ్యూస‌ర్ల‌కీ బంప‌ర్ ఆఫ‌ర్లు ఇస్తున్న టైమ్ ఇది. ఇక క్రియేట‌ర్లు కూడా ఫుల్లు కాంపిటీష‌న్ లో ఉన్నారు. ప‌వ‌న్ ని స్ట్రెస్ కి గురికాకుండా.. త‌మ వ‌ర్క్ ఫినిష్ చేసుకోవాల‌ని  చూస్తున్నారు. ఆ ఫేస్ లో ఉన్న చార్మింగ్.. ఆ పేరులో ఉన్న సౌండింగ్.. ఆ స్టార్ డ‌మ్ లో ఉన్న కాలిబ‌ర్ ని క‌రెక్ట్ గా క్యాష్  చేసుకోవాల‌ని చూస్తున్నారు.

ఇప్పుడు మెయిన్ గా ఐదు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. దీంతో ఇదే క్రియేట‌ర్లు పోటీ  ప‌డుతున్నార‌ట‌. వ‌కీల్ సాబ్ ముందుగా  రాబోతున్న సినిమా.  ఇది  రీమేక్ మూవీ. ఆల్రెడీ హిట్ టాకుంది. ఇది కూడా  హిట్ గ్యారంటీ అనేది ఇండ‌స్ట్రీ  లెక్క‌లు. దీంత‌ర్వాత క్రిష్ మూవీ  ఉండ‌బోతుంది. అది కూడా అంతే. క్రిష్  లెక్క‌లు వేరే క‌దా. ఆ థాట్సే కాస్త డిఫ‌రెంట్ గా ఉంట‌య్. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క్రిష్ క‌లుస్తున్నాడంటే ఆ సౌండింగ్ వేరే. వీటి మ‌ధ్య‌లో ఇంకో రీమేక్ వ‌చ్చింది. మ‌ళ‌యాళం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ కూడా  బంప‌ర్ హిట్.  క‌థ‌లో ఖ‌లేజా ఉంది. స్టార్ ఇమేజ్ కి క‌రెక్ట్ గా  ఉంటుంది. ఇది కూడా  ప‌ట్టాలెక్క‌డానికి  రెడీగా ఉంది. ఇక హ‌రీశ్ శంక‌ర్ మూవీతో పాటు.. ప‌వ‌న్ సురేంద‌ర్ రెడ్డి సినిమాలు  కూడా వెంట వెంట‌నే సెట్స్ పైకి వెళ్తాయి. వీట‌న్నీటి రిలీజ్ గ‌ట్టిగా  సిక్స్ మంథ్స్ గ్యాప్ లో ఉంటుంది. సో.. పోలిక  క‌రెక్ట్ గా ఉంటుంది. వీటిలో ఏ సినిమా ఏ సినిమాని బీట్ చేస్తుంది. ఇండ‌స్ట్రీ రికార్డుల్ని ఏ సినిమా బీట్ చేస్తుంది. పాత లెక్క‌ల్ని సెట్ చేసే ఛాన్స్ ఏ క్రియేట‌ర్ కి ద‌క్కుతుంది అనే పాయింట్.. ప‌వ‌ర్ స్టార్  ఫ్యాన్స్ లో ఫుల్ గా తిరుగుతోంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle