newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

హరీష్ శంకర్ చేతుల మీదుగా 'క్షీర సాగర మథనం' సాంగ్

18-10-202018-10-2020 14:48:43 IST
2020-10-18T09:18:43.662Z18-10-2020 2020-10-18T09:18:39.898Z - - 25-10-2020

హరీష్ శంకర్ చేతుల మీదుగా 'క్షీర సాగర మథనం' సాంగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ మధ్యకాలంలో ఆయా సినిమాలకి సంబంధించిన పోస్టర్స్..సాంగ్..ట్రైలర్..టీజర్ లని సినీ సెలబ్రిటీలో లేక పొలిటికల్ లీడర్స్ తో రిలీజ్ చేయడం కామన్ గా మారింది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ చిత్ర సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ చిత్రం ఏంటో చూద్దాం. అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం 'క్షీర సాగర మథనం'. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతోంది ఈ మూవీ.

కాగా ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ సీనియర్  నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రదీప్ రుద్ర  విలన్ గా నటిస్తున్నాడు. కాగా 'క్షీరసాగరమథనం'చిత్రంలోని 'నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం'  గీతాన్ని   హరీష్ శంకర్ ట్విట్టర్ లో విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

మహేష్ - పూరి కాంబినేషన్ సెట్ అయ్యిందా..?

అజయ్ అరసాడ స్వర కల్పనలో..  శ్రీమణి రాసిన ఈ పాటను 'రాములో రాముల' ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ  చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. 'క్షీర సాగర మథనం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు.. "క్షీర సాగర మథనం" చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకముందని తెలిపాడు. మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కాగా...ఈ సాంగ్  ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చేతుల మీదుగా రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాటల ద్వారా కూడా పలు చిత్రాలు హిట్ అవుతున్నాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించనుందో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle