newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఎడారిలో చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. 'కియారా'

18-10-202018-10-2020 18:05:34 IST
2020-10-18T12:35:34.334Z18-10-2020 2020-10-18T12:35:30.074Z - - 25-10-2020

ఎడారిలో చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. 'కియారా'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ టూ టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలు.. దర్శకనిర్మాతలకు హాట్ ఫేవరెట్ గా వెలిగిపోతోంది కియారా అద్వాని. `లస్ట్ స్టోరీస్`... కబీర్సింగ్... గుడ్ న్యూజ్ వంటి చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుని బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ క్రేజ్ ని సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు..రామ్ చరణ్ సరసన ఆడి..పాడింది ఈ బ్యూటీ.  ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో  అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న `లక్ష్మీబాంబ్` చిత్రంలో నటిస్తోంది. `కాంచన`ఆధారంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్నిరీమేక్ చేస్తున్నాడు.

హార్రర్  థ్రిల్లర్ కథాంశంతో కామెడీని మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నవంబర్ 9న డిస్నీ ప్లస్  హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేయగా వైరల్ అయ్యింది. తెలుగు-తమిళ వెర్షన్లకు కొంత భిన్నంగా ఎక్స్ట్రా ఎంటర్ టైన్ మెంట్ ని..హారర్ అంశాలనీ జోడించి తెరకెక్కించడంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు.

`బూర్జ్ ఖలీఫా ...` అంటూ సాగే ఈ పాటని అక్షయ్ కుమార్ - కియారా జంటపై చిత్రీకరించారు. అనార్కలీ తరహా కాస్ట్యూమ్స్ ధరించి హీటెక్కించే అందాలతో కియారా కనిపించబోతోంది. ఈ పాటని దుబాయ్  ఎడారిలో చిత్రీకరించారు. ఎర్రటి ఎండలో హీటెక్కించే అందాలతో చెప్పులు లేకుండా కియారా డ్యాన్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూళ్లలో ఆనందించదగ్గ షెడ్యూల్ దుబాయ్. ఈ షెడ్యూల్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యాన్సీ ఔట్ ఫిట్ లో ఈ పాటని చేయడం జరిగింది. మంచు కొండల్లో షిఫాన్ సారీలో డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఈ ఎడారిలో కాళ్లకి చెప్పులు లేకుండా నటించడం అంతే కష్టం` అని చెబుతోంది ఈ బ్యూటీ.  సినిమా అంటే అంత ఈజీ కాదు..ఎండల్లో..వానల్లో కష్టపడాల్సిందే. అంత కష్టపడిన తర్వాత రిజల్ట్ కోసం అంతే ఆతృతకూడా ఉంటుంది. మరి ఈ సినిమా కియారాకి ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle