newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

మ‌న ద‌గ్గ‌రే క్లైమ్యాక్స్..K G F రిలీజ్ డేట్ ఫిక్స్

17-10-202017-10-2020 18:41:24 IST
Updated On 17-10-2020 18:42:41 ISTUpdated On 17-10-20202020-10-17T13:11:24.015Z17-10-2020 2020-10-17T13:11:10.437Z - 2020-10-17T13:12:41.894Z - 17-10-2020

మ‌న ద‌గ్గ‌రే క్లైమ్యాక్స్..K G F రిలీజ్ డేట్ ఫిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏది ఏమైనా స‌రే. K G F మూవీ టీం మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తెర‌మీదే కాదు. తెర వెన‌క వ‌ర్క్ లో కూడా మాంచి మ‌జిల్ ప‌వ‌ర్.. బ్రెయిన్ ప‌వ‌ర్ ఉన్న‌ట్లుంది. ర‌య్యి ర‌య్యిన షూటింగ్ కంప్లీట్ అవుతోంది. కేజీఎఫ్ మూవీ అంటే ఆ యాక్ష‌న్ సీన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే క‌దా. అలాంటిది క్లైమ్యాక్స్ ఇంకెంత టెర్రిఫిక్ గా ఉంటుంది చెప్పండి. ఆ క్లైమ్యాక్స్ షూట్ లో బిజీగా ఉందంట‌.. కేజీఎఫ్ టీమ్. అది కూడా మ‌న హైద‌రాబాద్ లోనే షూట్ జ‌రుగుతోందంట‌. ఆల్ర‌డీ కేజీఎఫ్ హీరో యాష్ హైద‌రాబాద్ వ‌చ్చేశాడు. ఇక సంజ‌య్ ద‌త్ కూడా వ‌స్తున్నాడ‌ట‌. సంజ‌య్ ద‌త్ ఎంట్రీ ఇవ్వ‌గానే దుమ్ముదుమార‌మేన‌ట‌.

ఇక రిలీజ్ విష‌యంలో కూడా కే జీ ఎఫ్ టీమ్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. భారీ మూవీస్ వాళ్లంతా ఈ టైమ్ లో ఎందుకులే కాస్త టైం తీసుకుందాం అని ఆలోచిస్తున్నారు. కానీ .. కేజీఎఫ్ టీమ్ అలా కాదు. మేం కాని థియేట‌ర్ లోకి వ‌స్తే.. ఆడియ‌న్స్ వాళ్లంతట వాళ్లే వ‌స్తారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నార‌ట‌. అందుకే.. బ‌డా బ‌డా స్టార్లు బ‌రిలో నిల‌బ‌డే సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఏది ఏమైనా.. జ‌న‌వ‌రి 14న మూవీ రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అదుకే.. క‌రోనా గిరోనా జాన్ తా నై అంటూ..మూవీ ప‌నిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వాళ్లైతే నిద్రాహార‌లు బంద్ చేసి ప‌ని చేస్తున్నార‌ట‌.

నిజ‌మే. ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఆ మాత్రం కిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు తీస్తున్న‌ది మామూలు సినిమా కాదు.. కేజీఎఫ్ - 2. మాస్ కా బాప్ అన్న‌ట్లు ఉంటుంది. అందుకే.. ఆ మాస్ కా బాప్ అనేలా మాస్ట‌ర్ పీస్ ని రెడీ చేస్తున్నారు. ఆడియ‌న్స్ వెయిట్ చేసి.. టిక్కెట్ బుక్ చేసుకోవ‌డ‌మే లేట్. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle