newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ

02-03-202102-03-2021 11:42:07 IST
2021-03-02T06:12:07.978Z02-03-2021 2021-03-02T04:56:46.188Z - - 11-04-2021

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలకు పెద్ద దుమారమే రేగింది. పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ముంబై కోర్టు మార్చి 1న ఆమెపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సినీ రచయిత జావెద్ అఖ్తర్ కొన్ని నెలల క్రితం కంగనపై పరువునష్టం దావా వేశారు. గత నెల 1న ఈ కేసును అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది. మార్చి 1వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలంటూ కంగనను కోర్టు ఆదేశించింది.  కోర్టు ఇచ్చిన గడువు ముగిసినా..  కోర్టుకు కంగన హాజరు కాలేదు. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం కంగనకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. కంగనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఆమె లాయర్ రిజ్వాన్ సిద్ధికీ స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలను బాంబే హైకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో జావెద్ అఖ్తర్ తరపు లాయర్ స్పందిస్తూ పైకోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు ముందు హాజరు కావడం నుంచి కంగన తప్పించుకోలేరని అన్నారు. కాబట్టి కంగనా కోర్టుకు హాజరు కావాల్సిందేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈమెయిల్స్ వేధింపుల విషయంలో కంగనపై కేసు నమోదు చేసిన హృతిక్ రోషన్.. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు హృతిక్ రోషన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తన పేరుతో నకిలీ ఈమెయిల్ ద్వారా వందలాది మెయిల్స్‌ను పంపుతున్నారని, తనను విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నారని హృతిక్ రోషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కంగన పాత్ర ఉందంటూ హృతిక్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దాంతో పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై సైబర్ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం కమిషనర్ కార్యాలయానికి రావాల్సిందిగా హృతిక్ రోషన్‌కు పోలీసులు నోటీసులు పంపారు. ఆ నోటీసులను అందుకున్న హృతిక్ ఇటీవలే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు కమిషనర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చారు.

 

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle