కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్
20-01-202120-01-2021 15:16:50 IST
Updated On 20-01-2021 15:48:45 ISTUpdated On 20-01-20212021-01-20T09:46:50.011Z20-01-2021 2021-01-20T09:46:24.174Z - 2021-01-20T10:18:45.804Z - 20-01-2021

ఆయన కేవలం నటుడే కాదు నిర్మాత..దర్శకుడు..డ్యాన్సర్ ఇలా పలు ప్రతిభలు ఆయన సొంతం. అందుకే ఆయన విశ్వనటుడుయ్యారు. సినిమాలే కాదు మరోపక్క రాజకీయాలతో కూడా బిజీగా మారి అన్నింటినీ సవ్యసాచిలా నడిపిస్తున్నారు కమల్ హాసన్. కాగా ఆయన ఇంతబిజీ షెడ్యూల్ లో ఆసుపత్రిలో చేరారట కమల్ హాసన్. అంత అర్జెంట్ గా ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందో తెలుసుకుందాం. కమల్ హాసన్ కాలికి శస్త్రచికిత్స చేయనుండడమే ఆసుపత్రిలో చేరడానికి కారణమట. తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ లెగ్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నాలుగైదు రోజుల పాటు డాక్టర్ పరిశీలనలో ఉంటారని.. అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. కమల్ హాసన్ ఇటీవల ప్రకటించిన కొత్త చిత్రం `విక్రమ్` షూటింగ్ కిక్-స్టార్ట్ చేయాల్సి ఉండగా శస్త్ర చికిత్స జరిగింది. చిన్నపాటి గ్యాప్ తీసుకుని వెంటనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీ `మక్కల్ నీది మయం` మేలో జరగనున్న తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగనుంది. సీనియర్ స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా తమ తండ్రి..విశ్వ నటుడు కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స జరిగిందని శృతిహాసన్, అక్షర హాసన్ తెలిపారు. నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే కమల్ ఉంటారని, తర్వాతే డాక్టర్స్ ఆయన్ని డిశ్చార్స్ చేస్తారని తెలిపారు. కమల్ కాలి ఆపరేషన్‌ను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్లో నిర్వహించారని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తర్వాత ఆయన మళ్లీ ప్రజలను ఎప్పటిలాగే కలుసుకుంటారని శ్రుతి, అక్షర తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ గత కొన్నిరోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాలు నొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్స్ ఆపరేషన్ నిర్వహించారు.

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021

పవన్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
02-03-2021

సన్నీలియోన్ కి మళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
02-03-2021

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
02-03-2021

నెట్ ఫ్లిక్స్ కి నాగ్ షాక్..అంత నమ్మకం ఏంటి..డేర్ స్టెప్ ఏంటి
01-03-2021

అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు
01-03-2021
ఇంకా