newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐకాన్ స్టార్ కి అంత సీన్ లేదంట

08-04-202108-04-2021 17:21:21 IST
2021-04-08T11:51:21.090Z08-04-2021 2021-04-07T19:38:52.507Z - - 11-04-2021

ఐకాన్ స్టార్ కి అంత సీన్ లేదంట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ స్టార్లు ఎవ‌రు. ఎవ‌రిస్తారు. ఎందుకిస్తారు.. ఎలా ఇస్తారు.. ఏంటి ప్రూఫు.. ఏంటి  వ్యాలిడిటీ.. ఒక‌రు మెగాస్టార్.. ఒక‌రు ప‌వ‌ర్ స్టార్.. మ‌రొక‌రు మెగా ప‌వ‌ర్ స్టార్.. ఇంకొక‌రు స్టైలిష్ స్టార్.. ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. విక్ట‌రీ వెంక‌టేశ్.. ఇలా ఎన్నో స్టార్లు. కదా. ఎవ‌రిస్తారు అనేది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ మ‌ధ్య అయితే.. యంగ్ హీరో ప్రిన్స్ అస‌లు పేరు కూడా ప్రిన్సే అయితే.. ఆ పేరు త‌ను వాడుకోవ‌డానికి కూడా మ‌హేష్ ఫీల్ అవుతాడేమో అని టాక్ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ తేజానే.. హీరో ప్రిన్స్ ని ఇంట్ర‌డ్యూస్ చేసే టైంలో.. మ‌హేశ్ ఫీల్ అవుతాడేమో అన్నాడు. అంటే.. ప్రిన్స్ అనే ప‌దంపై మ‌హేశ్ బాబుకే కాపీ రైట్ ఉందా. ఏమో..

ఇక పోతే.. ఇప్పుడీ టాపిక్ మ‌ళ్లీ వ‌చ్చింది. బాలీవుడ్ లో బ‌డా స్టార్లు ఉన్నారు. వాళ్లు పెద్ద‌గా స్టార్ ట్యాగ్ లు వాడుకోరు. వాళ్లకి ఓన్ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. మ‌న తెలుగులో మాత్రం..  రెండు సినిమాలు హిట్ అయితే చాలు.. స్టార్ ట్యాగ్ త‌గిలించేయాల్సిందే. స్టార్ కిడ్ లు అయితే.. ఫ‌స్ట్ ఎంట్రీ  ఎంట్రీనే  స్టార్ ట్యాగ్ ఉంటుంది. ఏదో ఒక స్టార్ ట్యాగ్ త‌గిలించుకుంటారు.  గ‌బుక్కున  ఎవ‌రైనా ఆ స్టార్ ట్యాగ్ ని వాడేసుకుంటారేమో అనే భ‌యంతో ముందే త‌గిలించుకుంటారు. 

అల్లు అర్జున్ స్టార్ ట్యాగ్ మార‌డంతో ఈ స్టార్లేంటి.. ఈ గోలేంటిరా నాయ‌నా.. ముందు మంచి సినిమాలు తీయండి బాసూ.. మిమ్మ‌ల్ని మీరుగా మా గుండెల్లో పెట్టుకుంటాం అంటున్నారు ఆడియ‌న్స్. స్టైలిష్ స్టార్ అని బ‌న్నీకి ఎవ‌రు పెట్టారో తెలియ‌దు కానీ.. స్టైలిష్ లో ప‌వ‌ర్ లేదు.. అది అంత స్టఫ్ ఉన్న స్టార్ కాదు.. అందుకే.. ఇక అల్లు అర్జున్ కి నేను ఐకాన్ స్టార్ గా నామ‌క‌ర‌ణం చేస్తున్నా అంటూ.. డైరెక్ట‌ర్ సుకుమార్.. స‌గ‌ర్వంగా అనౌన్స్ చేశాడు. హీరో అల్లు అర్జున్ కూడా ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ ఎంజాయ్ చేశాడు. అంత వ‌ర‌కూ త‌న‌కి ఆ స్టార్ గురించి తెలీన‌ట్లే క‌వ‌రింగ్  ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. అంత సింపుల్ గా అల్లు అర్జున్ కి చెప్ప‌కుండా సుకుమార్ ఈ స్టార్ ట్యాగ్ ఇచ్చాడా.. లేదంటే.. అల్లు అర్జునే త‌న స్టార్ ట్యాగ్ ని మార్చుకోవాల‌ని.. ఐకాన్ స్టార్ న‌చ్చి.. సుకుమార్ తో నామ‌క‌ర‌ణం చేయించుకున్నాడా అన్న‌ది పాయింటే  ఇక్క‌డ‌. ఎందుకంటే.. ఆడియ‌న్స్ అడ‌గ‌క ముందే మీకోసం డాన్స్ అంటాడు.. ఆడియ‌న్స్ అడ‌గ‌క ముందే మీకోసం మీకోసం ఇంకోసారి ఇంకోసారి.. చివ‌ర‌గా మరోసారి అంటూ డైలాగులు చెప్పిన అల్లు అర్జున్ ని చూసి.. బ‌న్నీ ఇంకా హిపోక్రసీలో నుంచి బ‌య‌టికి రావ‌డం లేదేమో అనుకుంటున్నారు జ‌నాలు. ఆ హిపోక్ర‌సీ మ‌త్తులో ప‌డిపోయే.. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని లైట్ తీసుకోవ‌డం.. ఆయ‌న‌ని లెక్క చేయ‌క‌పోవ‌డంతో..ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యి.. రివెంజ్ తీర్చుకోవ‌డం.. మ‌ళ్లీ బ‌న్ని కాంప్ర‌మైజ్  అవ్వ‌డం అన్నీ చూశాం క‌దా. అవ‌న్నీ అలా వ‌దిలేస్తే.. 

ఐకాన్ స్టార్ సౌండింగ్ కాస్త స్టైల్ గా లేదు అంటున్నారు. ఐకాన్ స్టార్ అంటున్నారా.. ఐట‌మ్ స్టార్ అంటున్నారా అంటూ ట్రోలింగ్ లు మొద‌ల‌య్యాయి. స్టైలిష్ స్టారే స్టైలిష్ గా ఉంది..బన్నీ సూప‌ర్ స్టైల్ గా ఉంటాడు కాబ‌ట్టి.. స్టైలిష్ స్టార్ సూప‌ర్ అంటున్నారు. బ‌న్నీకి ఐకాన్ స్టార్ ట్యాగ్ స్యూట్ కాలేదు అంటున్నారు. ఐకాన్ అనేది క్యాచీగా లేదు అంటున్నారు. స్టైలిష్  స్టార్ లో ప‌స లేదు అంటూ.. సుకుమార్ అన‌డం కాస్త ఇబ్బంది క‌ర విష‌య‌మే. ఆ స్టార్ డ‌మ్ కూడా ఏదో ఒక డైరెక్ట‌రే ఇచ్చుంటాడు క‌దా. ఆయ‌న ఇచ్చిన స్టార్ లో ప‌స లేదు.. నేనిచ్చే స్టారే గొప్ప అని సుకుమార్ స్టేజి మీద చెప్ప‌డంపై త‌లో మాటా అంటున్నారు. ఇక‌పోతే.. బ‌న్నీ ఎప్ప‌టికీ స్టైలిష్ స్టారే.. బ‌న్నీ స్టైల్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఈ ఐకాన్ స్టార్ అంటే.. ఎవ్వ‌రికీ ఎక్కిసావ‌దు.. స్టైలిషే  బావుంది అంటున్నారు బ‌న్నీ ఫ్యాన్స్. ఎర్ర చొక్కా న‌చ్చ‌క‌పోతే న‌ల్ల చొక్కా వేసుకోవ‌చ్చు కానీ.. ఇలాంటి స్టార్ డ‌మ్ లు వ‌చ్చిన త‌ర్వాత వాటిని బ్రేక్ చేసి.. కొత్త స్టార్ ట్యాగ్ లు త‌గిలించినంత మాత్రాన‌ వ‌ర్క‌వుట్ కావు అనేది ఫ్యాన్స్ ఇంటెన్ష‌న్. అంతా సుద్ద దండ‌గ ప‌నులే అంటున్నారు. వ‌చ్చిన పేరు స‌చ్చినా పోదు అంటారు క‌దా. అది నెగ‌టివ్ కే కాదు.. పాజిటివ్ కి కూడా ఉంటుంది. సుకుమార్ ఏదో బ‌న్నీని ఆర్య అని పిలుస్తున్నారు ఇప్ప‌టి దాకా అన్నాడు కానీ.. అల్లు అర్జున్ ని ఎవరు ఆర్యా అని పిల‌వ‌రు. ఆర్య సినిమాలు సూప‌ర్ సినిమాలే. కానీ.. బ‌న్నీ అనే పిలుస్తున్నారు. ఒక‌సారి ఒక స్టార్ డ‌మ్ వ‌స్తే.. ఇంకోటి ప‌ట్టించుకోరు. ఇక మీడియా సోష‌ల్ మీడియాల్లో వేసి రుద్దితే ఏమో త‌ప్ప‌.. అంత సీన్ లేదు అంటున్నారు. అల్ల‌రి న‌రేష్ కి అల్ల‌రి  సినిమాతో వ‌చ్చిన  పేరు.. నెక్స్ట్ సినిమాకి మార‌లేదు క‌దా. మొన్న నాంది న‌రేష్ అంటూ అనుకున్నారు అలా కూడా అన‌డం లేదు క‌దా. ఇప్ప‌టికి కూడా అల్ల‌రి న‌రేషే అంటున్నారు. జేడీ చ‌క్ర‌వ‌ర్తిని త‌ర్వాత స‌త్య అన‌లేదు.. ఇప్ప‌టికి కూడా జేడీ అనే అంటున్నారు. అంటారు కూడా. కానీ.. సుకుమార్ ప్ర‌యాస‌లు ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో చూద్దాం.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle