newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

సుకుమార్ కి భారీ అడ్వాన్స్ - ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!

29-09-202029-09-2020 19:03:46 IST
2020-09-29T13:33:46.501Z29-09-2020 2020-09-29T13:33:44.521Z - - 25-10-2020

సుకుమార్ కి భారీ అడ్వాన్స్ - ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్... ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. త్వరలో కేరళలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఎవరూ ఊహించని విధంగా సుకుమార్.. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాని ఎనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ కాంబినేషన్ గురించి కనీసం ఒక్కసారి కూడా అనుకోలేదు. అలాంటిది ఈ కాంబినేషన్ లో మూవీ ప్రకటించడంతో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉంటే... ఈ సినిమా కోసం సుకుమార్ కి భారీగా అడ్వాన్స్ ఇచ్చారట. ఎంతంటే... సుకుమార్ కి 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని.. అలాగే మరో 5 కోట్లు అడ్వాన్సులు రూపంలో ఇచ్చారని బయటకు రావడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. 2022లో తీసే సినిమా కోసం.. ఇప్పుడు 15 కోట్లు అడ్వాన్సులు ఇవ్వడంతో టాలీవుడ్ సర్కిళ్లలో చర్చ జరుగుతుంది. 2022లో మార్కెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 15 కోట్లు..అదీ కూడా ఓ కొత్త నిర్మాత ఇంత భారీగా అడ్వాన్స్ ఇవ్వడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.

దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నట్లు ఎనౌన్స్ చేసారు. విజయ్ ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు. ఆతర్వాత శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత విజయ్ సుకుమార్ తో సినిమాని స్టార్ట్ చేయనున్నారు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle