newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

బాలయ్య - బోయపాటి మూవీకి హీరోయిన్ ఫిక్స్

17-10-202017-10-2020 21:43:14 IST
Updated On 18-10-2020 08:51:50 ISTUpdated On 18-10-20202020-10-17T16:13:14.172Z17-10-2020 2020-10-17T16:12:53.796Z - 2020-10-18T03:21:50.783Z - 18-10-2020

బాలయ్య - బోయపాటి మూవీకి హీరోయిన్ ఫిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నందమూరి నటసింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. వారణాసిలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న టైమ్ లో కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాని ప్రకటించడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం... జరిగింది.

ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది కానీ.. హీరోయిన్ ఎవరు అనేది మాత్రం అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెర పడిందని చెప్పచ్చు. ఇంతకీ మేటర్ ఏంటంటే... తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ హీరోయిన్‌గా ఎంపిక చేసారని తెలిసింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌లో ఆమె జాయిన్‌ అవుతుందని అంటున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తుండగా ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. మరో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.  

ఈ మలయాళ ముద్దుగుమ్మ తెలుగు వారికి పరిచయం వున్న ఉస్తాద్ హోటల్ సినిమాలో చిన్న కామియో పాత్రలో కనిపించింది. మిగిలిన సినిమాలు అన్నీ మలయాళం సినిమాలే. తెలుగులో అందులోనూ బాలయ్య సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం.

బోయపాటితో సినిమా షూటింగ్ కి బాలయ్య రావడం లేదా..?


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle