newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

లైంగిక వేధింపుల కేసులో జైల్లో నిర్మాత..గుడ్డివాడయ్యాడట

18-10-202018-10-2020 15:10:50 IST
2020-10-18T09:40:50.953Z18-10-2020 2020-10-18T09:37:44.241Z - - 25-10-2020

లైంగిక వేధింపుల కేసులో జైల్లో నిర్మాత..గుడ్డివాడయ్యాడట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చేసిన పాపం ఊరికే పోతుందా అన్నట్లు అయింది ఈ నిర్మాతని చూస్తుంటే..ఆయనే హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్. ఈయన వయసు 68సంవత్సరాలు. లైంగిక వేథింపుల కేసులో అరెస్టయిన ఈ నిర్మాత ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. కాగా  న్యాయవాదులు తాజా ప్రకటనలో భయాన్ని వ్యక్తం చేసారు. వీన్ స్టీన్ గుడ్డివాడు అయ్యాడు. 20 వేర్వేరు ఔషధాలను సేవిస్తున్న ఆయనను విడుదల చేయకపోతే జైలులో చనిపోతాడని చెప్పడం సంచలనమే అయ్యింది.

రకరకాల అనారోగ్యాలతో సతమతమవుతున్న కారణంగా వెంటనే విడుదల కాకపోతే జైలులో చనిపోతానని హార్వే వీన్ స్టీన్ తరపు  న్యాయవాదులు  విచారణ సందర్భంగా వాదించారు. నేరంపై అప్పీల్ చేస్తూ వీన్ స్టీన్ బెయిల్ పై విముక్తి పొందాలని లాయర్లు కోరారు. అతను గుడ్డి వాడయ్యాడని... వీల్ చైర్ కి కట్టేసారని..వీన్ స్టీన్  కొరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్నాడని.. ప్రోస్టేట్ ఉందని న్యాయవాదులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ విచారణకు సంబంధించిన 2 మిలియన్ల బాండ్.. అదనంగా 5 మిలియన్లను చెల్లించడానికి అతని వద్ద డబ్బు లేదని వారు చెప్పారు.

అయితే ప్రతివాద న్యాయవాది వెర్షన్ వేరొకలా ఉంది. వీన్ స్టీన్ కి ఏమీ కాలేదని .. విడుదలైతే పారిపోవడానికి చూస్తున్నాడని వాదించడం ఆసక్తికరం. వీన్ స్టీన్  ప్రస్తుతం అత్యాచారం లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ సమయంలో న్యూయార్క్ - ఆల్డెన్ లోని వెండే కరెక్షనల్ ఫెసిలిటీలో 23 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. హార్వే వీన్‌స్టీన్‌పై నటి అలిసా మిలానో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సామాజిక కార్యకర్త తరానా బర్కేతో కలిసి ఆమె 'మీ టూ' ఉద్యమాన్ని ప్రారంభించారు.

వారి స్ఫూర్తితో హార్వే వీన్ స్టీన్ లైంగిక వేధింపుల బారిన పడ్డ ఎందరో తారలు మీడియా ముందుకు వచ్చారు. తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టారు. హార్వే వీన్‌స్టీన్‌పై డజన్ల కొద్దీ లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. వందలాది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని పాశ్చాత్య మీడియాలో వీన్ స్టీన్ పై కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యారాయ్‌ని కూడా వీన్‌స్టీన్‌ వేధించాడని ఆమె మాజీ మేనేజర్‌ షిఫీల్డ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వీన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల వ్యవహారంతో.... హాలీవుడ్‌ తారలంతా ఏకమయ్యారు. దాదాపు 300 మందికిపైగా నటీమణులు, మహిళా రచయితలు, దర్శకులు, నిర్మాతలు, ఎంటర్‌టైన్మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు కలిసి 'టైమ్‌ ఈజ్‌ అప్‌' అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle