newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

తల్లికాబోతున్న 'హరితేజ'.. సెలబ్రిటీల కంగ్రాట్స్!

05-12-202005-12-2020 14:54:43 IST
Updated On 05-12-2020 15:49:27 ISTUpdated On 05-12-20202020-12-05T09:24:43.791Z05-12-2020 2020-12-05T09:24:16.720Z - 2020-12-05T10:19:27.112Z - 05-12-2020

తల్లికాబోతున్న 'హరితేజ'.. సెలబ్రిటీల కంగ్రాట్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నానని తెలిపింది క్యారెక్టర్ ఆర్టిస్టు హరితేజ. తనదైన నటనతో కామెడీ రోల్స్ లలోనే కాదు ఎమోషనల్ సీన్స్ లో కూడా హరితేజ నటనకి మంచి మార్కులే పడతాయి. అంతేనా బిగ్ బాస్ ఫేమ్ గానే కాదు.. నటిగా.. యాంకర్ గా కూడా హరితేజ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని పోస్ట్ చేసిందామె. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దాంతో పలువురు నెటిజన్స్ హరితేజకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇటీవల లాక్ డౌన్ లో ఆమె ఇంటికే పరిమితమయింది. బిగ్ బాస్ హౌస్ ద్వారా హరితేజ ఎంతో పాపులర్ అయింది. అంతకుముందు కూడా ఆమె పలు సీరియళ్లు.. కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘అఆ’ సినిమాలోని పనిమనిషి పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ మా.. జెమినీ.. ఈటీవీ లాంటి ఛానల్స్ లో ఆమె ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలకు యాంకరింగ్ కూడా చేసిందామె.

Hari Teja about actual age: I am just 28 - tollywood

బిగ్ బాస్ సీజన్ 1లో హరితేజ ఎంతగానో అలరించింది. ఆమె ఫైనల్ రౌండ్ దాకా హౌజ్ లో కొనసాగడం విశేషం. హరితేజ విజేతగా నిలుస్తారని అంతా భావించారు. కానీ చివరినిమిషంలో అభిమానుల ఓటింగ్ ముఖ్యంగా ఓ ప్రముఖహీరో అభిమానులు కట్టగట్టుకొని మరో సభ్యుడిగా ఓట్లు వేశారు. దీంతో ఆమె టైటిల్ విజేతగా నిలవలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆమె బిగ్బాస్ హౌస్ కి వెళ్లాక ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది కూడా. ఆ తర్వాత ఆమెకు కొంతకాలం పాటు సినిమా చాన్స్లుకూడా బాగానే వచ్చాయి. కానీ కరోనా లాక్ డౌన్ లో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. హరితేజ తల్లి కాబోతుండటం తో పలువురు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle