newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?

16-01-202116-01-2021 20:17:53 IST
2021-01-16T14:47:53.185Z16-01-2021 2021-01-16T14:10:03.791Z - - 27-02-2021

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నేటి హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నాక కూడా సినీ ఇండస్ట్రీలో తమ హవాని కొనసాగిస్తున్నారు. అక్కినేని వారి కోడలు సమంత అయితే వెబ్ సిరీస్..హోస్ట్ గా బిజీ బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో అయితే దీపిక పదుకొణే..ప్రియాంకచోప్రా లాంటి వారు ఏకంగా స్టార్ హోదాతో పాటు శ్రీమతి హోదాని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ హీరోయిన్ రిచాగంగోపాధ్యాయ మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కారణం తెలియదు కానీ పలువురు స్టార్ హీరోల సరసన మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఢిల్లీ సుంద‌రి రిచా గంగోపాధ్యాయ.

ఆ త‌ర్వాత దర్శకుడు హ‌రీష్ శంకర్-మాస్ మహారాజ్ ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన మిరప‌కాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప‌దేళ్లు పూర్తిచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామ్య‌మైన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు హ‌రీష్ శంక‌ర్. ఈ చిత్రంలో విన‌మ్రగా న‌టించిన రిచా గంగోపాధ్యాయ్ కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ ద్వారా త‌న సందేశాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై రిచా స్పందిస్తూ..ధ‌న్య‌వాదాలు హ‌రీష్‌. విన‌మ్ర పాత్ర‌లో న‌టించడం మ‌రుపురాని అవ‌కాశం. తెర‌వెనుక మీ గురించి తెలుసుకున్న వ్య‌క్తులు అదృష్ట‌వంతులు. మీరు అద్బుత‌మైన వ్య‌క్తి. తెలివైన దర్శ‌కుడు. ఫ‌న్ ల‌వ్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం ఉన్న వ్య‌క్తి. ఏదో ఒక రోజు మీరు నాకు అతిథి పాత్ర ఇచ్చే విష‌యాన్ని ప‌రిశీలిస్తారనుకుంటున్నానని రీట్వీట్ చేసింది. 

దీనికి వెంట‌నే దర్శకుడు హ‌రీష్‌శంక‌ర్ స్పందిస్తూ..అతిథి పాత్ర‌..ఇపుడు మీ ట్వీటే రుజువు. రెడీగా ఉండండి..అంటూ రీట్వ్‌ట్ చేయ‌గా..కేవ‌లం మీ కోసమే..న‌వ్వుతూ క‌నిపించే మీ కండ్ల కోసం..షూటింగ్ కు మార్గం క‌నుగొనండి అంటూ రిచా రిప్లై ఇచ్చింది. సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న రిచా పెండ్లి చేసుకుని వైవాహిక జీవితంపై త‌న ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం సొంత వ్యాపారాన్ని మొద‌లు‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది. మరి గెస్ట్ రోల్ లో నటిస్తుందో లేదో అనే విషయాన్ని మాత్రం తెలపలేదు ఈ భామ. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle