బాలయ్య, బోయపాటి సినిమాకి భారీ డిమాండ్.. కోట్లకి కోట్లు
21-02-202121-02-2021 11:09:33 IST
Updated On 22-02-2021 10:39:45 ISTUpdated On 22-02-20212021-02-21T05:39:33.128Z21-02-2021 2021-02-21T04:10:40.401Z - 2021-02-22T05:09:45.796Z - 22-02-2021

మరి బాలయ్య సినిమా అంటే ఏమనుకుంటున్నారు. ఎప్పుడో ఒక సినిమా దెబ్బై పోతుంది కానీ.. ఆ స్టార్ హీరో క్రేజ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఒక వేళ వరసగా రెండు మూడు ఫ్లాప్ లు వచ్చినా సరే.. బాలయ్య డిమాండ్ డిమాండే.. క్రేజు క్రేజే. ఎక్కడా తగ్గరు తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. బాలయ్య ఫ్యాన్ బేస్ అలాంటిది. హిట్టు ఫట్టులతో సంబంధం లేదు. మా బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే.. థియేటర్లన్నీ దారివ్వాల్సిందే అంటారు. అదీ బాలయ్య పవర్. ఇక బోయపాటి శ్రీనివాస్, బాలయ్య బాబు సినిమాలకి ఉండే క్రేజ్ తెలిసిందే కదా. రెండు బంపర్ హిట్ లు వచ్చాయి. ఇక మూడో సినిమా రాబోతుంది. హ్యాట్రిక్ గ్యారంటీ అని.. లక్ష రూపాయల బాండ్ పేపర్లుంటే రాసిచ్చే వాళ్లు కూడా ఉన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్.. వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అని.. మూడో సినిమా అంటే.. హ్యాట్రిక్ హిట్ గ్యారంటీ అనే గ్యారంటీ అందరూ ఇస్తారు. ఎందుకంటే.. హిస్టరీ అలాంటిది. వారి చరిత్రను వారే తిరగరాసే టైం వచ్చింది. సింహా, లెజండ్ సినిమాలు క్రియేట్ చేసిన వాళ్ల సినిమా రికార్డుల్ని.. మళ్లీ వాళ్లే బ్రేక్ చేయాలి. చేస్తారు కూడా.. అందులో ఎలాంటి డౌటూ లేదు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి సినిమాల మార్కెటింగ్ చూస్తే కూడా ఆ విషయంలో చాలా క్లారిటీస్ వస్తున్నయ్. బీబీత్రీ మూవీకి ఫుల్ డిమాండ్ వచ్చింది. ఆ ఏరియా ఈ ఏరియా అని లేకుండా అన్ని ఏరియాల్లోనూ బంపర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. మాస్ కా బాప్ లు వస్తున్నారు.. థియేటర్లు దద్దరిల్లి పోతాయి అంటూ.. ఎన్ని కోట్లు పెట్టేందుకు అయినా మేం రెడీ అంటున్నారు. ఒక్క ఆంధ్రలోనే 35 కోట్ల డిమాండ్ ఉందంట. ఇక ఈస్ట్ వెస్టులు కలిపి.. 20 కోట్ల దాకా పోతున్నట్లు టాక్. మరి సీడెడ్, నైజాం లెక్కలు ఇంకెలా ఉంటాయో. అవి కూడా గతంలో రేట్లని క్రాస్ చేసి.. రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయట. ఆల్రెడీ మూడ్నెళ్ల టైం ఉంది రిలీజ్ కి. మే 28న అనుకుంటున్నారు. అయినా సరే.. కొనే వాళ్లు ఇప్పుడే ఎగబడుతున్నారు. మాక్కావాలి మాక్కావాలి అంటూ పోటీ పడుతున్నారట. కోట్లకి కోట్లు పెంచుకుంటూ.. ఏ మాత్రం తగ్గకుండా మూవ్ అవుతున్నారట. ఎందుకంటే.. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ అలాంటిది. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉందంటే.. థియేటర్లలోకి వచ్చాక.. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
5 hours ago

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021

పవన్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
02-03-2021

సన్నీలియోన్ కి మళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
02-03-2021

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
02-03-2021

నెట్ ఫ్లిక్స్ కి నాగ్ షాక్..అంత నమ్మకం ఏంటి..డేర్ స్టెప్ ఏంటి
01-03-2021

అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు
01-03-2021

ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ ఫిక్స్
28-02-2021

ప్లే బ్యాక్ మూవీలో ఏదో ఉన్నట్లుందే
28-02-2021
ఇంకా