నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్
20-01-202120-01-2021 22:02:46 IST
Updated On 21-01-2021 10:52:06 ISTUpdated On 21-01-20212021-01-20T16:32:46.176Z20-01-2021 2021-01-20T13:10:19.393Z - 2021-01-21T05:22:06.433Z - 21-01-2021

థియేటర్స్ తెరుచుకున్నా ఓటీటీ హవా ఇంకా నడుస్తూనే ఉంది. కాగా ఓటీటీ దిగ్గజం నెట్ ప్లిక్స్ ఫస్ట్ తెలుగు ఆంథాలజీ సిరీస్ ని రిలీజ్ కి రెడీ చేస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దర్శకుల ఆలోచనలు మారాయనే చెప్పాలి. కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కేవలం సినిమాలే కాదు వెబ్ కంటెంట్ తో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం విశేషం. దాంతో ఓటీటీలు - స్టార్ డైరెక్టర్లు - స్టార్ యాక్టర్స్ కలిసి ఆంథాలజీ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని రూపొందించారు. దీని కోసం ప్రతిభావంతులైన నలుగురు దర్శకులు నాగ్ అశ్విన్ - బి.వి.నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్ - సంకల్ప్ రెడ్డిలను ఒక చోట చేర్చింది నెట్ ప్లిక్స్. నెట్ ఫ్లిక్స్ తాజాగా తన మొదటి ఒరిజనల్ తెలుగు ఆంథాలజీ 'పిట్టకథలు' ను అధికారికంగా ప్రకటించింది. ఈ నాలుగు భాగాల ఆంథాలజీ చిత్రానికి నలుగురు అత్యుత్తమ దర్శకులు దర్శకత్వం వహించారని పేర్కొంది. సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను పిట్టకథలు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి తెలియజేస్తుంది. ఈ నాలుగు పాత్రల్లో ఈషా రెబ్బా - లక్షి మంచు - అమలా పాల్ - శృతిహాసన్ నటించారు. వీరితో పాటు అషిమా నర్వాల్ - జగపతిబాబు - సత్యదేవ్ - సాన్వే మేఘన - సంజిత్ హెగ్దే ఇతర కీలక పాత్రలు పోషించారు. 'పిట్టకథలు' సంకలనం 190 దేశాలలో నెట్ ప్లిక్స్ లో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు.'రాముల' అనే టైటిల్ తో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన భాగానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. అలానే 'మీరా' అనే టైటిల్ తో జగపతిబాబు - అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక శృతి హాసన్ లీడ్ రోల్ లో రూపొందిన 'ఎక్స్ లైఫ్' భాగానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. 'పింకీ' అనే టైటిల్ తో ఈషా రెబ్బా - సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన విభాగానికి సంజల్ప్ రెడ్డి డైరెక్షన్ చేశారు. టీజర్ చూస్తూనే ఈ 'పిట్ట కథలు' సిరీస్ లో అన్ని అంశాలు బోల్డ్ గా చర్చించినట్లు అర్థం అవుతోంది. ఇది హిందీ 'లస్ట్ స్టోరీస్' ని తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఆర్. ఎస్.వి.పి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ ఆంథాలజీ సిరీస్ ని నిర్మించారు. ఫిబ్రవరి 19న 'పిట్ట కథలు' సిరీస్ విడుదల కానుంది. చూడాలి మరి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో.

సినిమా ఏకీ నంబర్.. రెమ్యునరేషన్ ఏకీ క్రోర్
18 hours ago

విజయశాంతిలా ఇష్యూ చేస్తున్న సమంత
21 hours ago

అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
07-03-2021

ఈ సినిమా వాళ్లకి దొబ్బేసే అలవాటు ఎప్పుడు పోతుంది
07-03-2021

జాతిరత్నంతో అనుష్క రొమాన్స్
07-03-2021

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021
ఇంకా