newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

విదేశీ ఫైటర్స్ కోసం 'ఫైటర్' డిలే!

05-12-202005-12-2020 17:56:25 IST
Updated On 05-12-2020 18:37:27 ISTUpdated On 05-12-20202020-12-05T12:26:25.075Z05-12-2020 2020-12-05T12:26:07.799Z - 2020-12-05T13:07:27.677Z - 05-12-2020

విదేశీ ఫైటర్స్ కోసం 'ఫైటర్' డిలే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వల్ల ఎన్నో సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతం ఒక్కో థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలందరూ షూటింగ్ లకి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ లతో పాన్ ఇండియా మూవీలు తెరపై కన్నులవిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కరోనాకి ముందే స్టార్ట్ చేసిన చిత్రం పైటర్ ఆచూకీ మాత్రం కని..వినిపించడం లేదు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా..బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. 'ఫైటర్' మూవీ మార్చి లో కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. 30 శాతంకు పైగా చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించక పోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు అంతా కూడా షూటింగ్ లను ప్రారంభించారు. కాని ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ మాత్రం తన ఫైటర్ సినిమాను మొదలు పెట్టక పోవడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం కరోనా భయం లేకుండా షూటింగ్ లో జాయిన్ అయితే విజయ్ దేవరకొండ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడనే ప్రశ్న అందరిలో వ్యక్తం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది అనుకుంటే ఈ నెలలో కూడా షూటింగ్ లేదని తేలిపోయింది. జనవరి రెండవ వారంలో ఫైటర్ ను పునః ప్రారంభించే అవకాశం ఉందని టాక్.

ఫైటర్ సినిమా కోసం విదేశీ ఫైటర్స్ కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వారు వచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణం పునః ప్రారంభం ఆలస్యం అవుతుంది అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొన్ని సీన్స్ హిందీ ప్రేక్షకుల కోసం విభిన్నంగా రూపొందించనున్నారట. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ భాగస్వామిగా ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle