newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

అమెజాన్ చేతిలో ఎఫ్3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్

13-01-202113-01-2021 09:51:28 IST
2021-01-13T04:21:28.135Z12-01-2021 2021-01-12T17:40:37.728Z - - 21-01-2021

అమెజాన్ చేతిలో ఎఫ్3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒక మూవీ హిట్ అయితేనే గొప్పగా చెప్పుకుంటారు..అలాంటిది ఆయన తెరకెక్కించిన రెండు..మూడు చిత్రాలు హిట్ మీద హిట్ కొట్టాయి. దాంతో ఆ డైరెక్టర్ రేంజ్..రేటు రెండూ మారిపోయాయి. అంతేనా ఆయన తీసిన చిత్రాలకి సీక్వెల్ ని తీసే పనిలో పడ్డాడా దర్శకుడు..ఆయన మరెవరో కాదండి దర్శకుడు అనీల్ రావిపూడి. ఆయన తెరకెక్కించి ఎఫ్2 చిత్రం హిట్ అవ్వడంతో ఎఫ్3ని తెరకెక్కించే పనిలో పడ్డాడీ డైరెక్టర్. అంతేకాదండోయ్ తనకు రావల్సిన రెమ్యూనరేషన్ ని కూడా పెంచాడట అనీల్ రావిపూడి. అంతేలే హిట్ వచ్చినప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి మరి. ఆ పద్దతినే ఫాలో అవుతున్నాడీ దర్శకుడు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా - మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి ఫైనాన్స్ ని జత చేసి మోర్ ఫన్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో 'ఎఫ్3' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ ధర పలుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందట. రేట్ ఎంతో వెల్లడించనప్పటికీ ఈ సినిమా అన్ని భాషల రైట్స్ రికార్డు స్థాయి ధరకే అమ్ముడు పోయాయని అంటున్నారు. కాగా ఇటీవలే తిరిగి ప్రారంభమైన 'ఎఫ్ 3' షూటింగ్ రెండో షెడ్యూల్ జరువుకుంటోంది. తాజా షెడ్యూల్ లో కరోనా నుంచి కోలుకున్న వరుణ్ తేజ్ కూడా పాల్గొంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బొమన్ ఇరానీ - సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

   2 hours ago


ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

   3 hours ago


వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

   5 hours ago


అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

   15 hours ago


మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

   17 hours ago


నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న  పిట్టకథలు టీజర్

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్

   15 hours ago


పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

   20 hours ago


'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

   18 hours ago


కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

   a day ago


త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle