newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెండు నెలల్లో 20 కిలోల బరువు పెరిగి, తగ్గాను.. తలైవి పై కంగనా వ్యాఖ్య

04-04-202104-04-2021 11:01:33 IST
2021-04-04T05:31:33.988Z04-04-2021 2021-04-04T01:45:41.478Z - - 16-04-2021

రెండు నెలల్లో 20 కిలోల బరువు పెరిగి, తగ్గాను.. తలైవి పై కంగనా వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన తలైవా సినిమా తొలి పాట ''చలి చలి''ని శుక్రవారం విడుదల చేయగా అభిమానుల ఆనందోత్సాహాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా తన అభిమానులతో ముచ్చటించిన కంగనా తలైవా సినిమా షూటింగులో పాల్గొంటున్నప్పుడు ఒక అతీత శక్తి ఆవహించినట్లు అయిందని చెప్పారు. ఈ సినిమాలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రను కంగనా పోషించిన విషయం తెలిసిందే.

తలైవి సినిమా షూటింగు మిస్టరీతో ప్రారంభమైందని, తలైవీ పాత్ర పోషణ తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని కంగనా తెలిపారు. ఇంతవరకు మీ సినీజీవితంలో పోషించిన అత్యంత సంతృప్తికరమైన పాత్ర ఏది అని అభిమానులు అడిగిన ప్రశ్నకు తలైవిలో జయలలిత పాత్రేనని కంగనా చెప్పారు. ఈ సినిమా కోసం తన శరీరం రూపురేఖలను పూర్తిగా మార్చుకోవలసి వచ్చిందని కొద్ది నెలల వ్యవధిలోనే 20 కిలోలు బరువు పెరిగి, మళ్లీ తగ్గాల్సి వచ్చిందని కంగనా చెప్పారు.

2013లో తాను క్వీన్ సినమాలో రాణి పాత్రను పోషించినప్పుడు కూడా ఆ పాత్రతో తాదాత్మ్యం చెందానని కంగనా తెలిపారు. ఆ సమయంలో తన జీవితం కూడా అదే పరిస్థితుల గుండా సాగిందని అందుకే రాణి పాత్ర తనను అంతగా ఆవహించిందని కంగనా చెప్పారు. క్వీన్ సినిమాలో రాణి పాత్రకు గాను 62వ జాతీయ చిత్రాల అవార్డుల్లో ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్ అవార్డు సాధించింది. 

తాజాగా కంగనా నటించిన తలైవి చిత్రానికి ఎఎల్ విజయం దర్శకత్వం వహించగా బాహుబలి చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్‌తో పాటు రజత్ అరోరా, మదన్ కార్కీ స్క్రీన్ ప్లే రాశారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామీ, నాజర్, భాగ్యశ్రీ, రాజా అర్జున్, పూర్ణ, మధుబాల తదితరులు నటించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle