newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

అదితీని ఆట పట్టిస్తున్న దుల్కర్..!

29-10-202029-10-2020 20:48:15 IST
Updated On 30-10-2020 07:28:06 ISTUpdated On 30-10-20202020-10-29T15:18:15.941Z29-10-2020 2020-10-29T15:18:10.854Z - 2020-10-30T01:58:06.366Z - 30-10-2020

అదితీని ఆట పట్టిస్తున్న దుల్కర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్ బ్యూటీ అదితీరావ్ హైదరీ పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారింది. ఒకేసారి సౌత్.. నార్త్ రెండు చోట్లా హవా సాగిస్తోంది ఈ భామ. ముఖ్యంగా మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ వద్ద ఆస్థాన నాయికగా సెటిలైపోయిన అదితీకి అటు హిందీ లోనూ ఇటు తెలుగు తమిళం మలయాళంలోనూ మంచి గుర్తింపు దక్కుతోంది. ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు మలయాళ పరిశ్రమను ఈ అమ్మడు అస్సలు విడిచిపెట్టడం లేదు. కేవలం గ్లామర్ ఎలివేషన్ కి సంబంధించిన పాత్రలే కాదు.. నటనలో నిరూపించుకునేందుకు ఆస్కారం ఉన్న పాత్రలతోనే మురిపిస్తోంది అదితీ.

ఇక ఇటు తెలుగు స్టార్లు సహా అటు మలయాళ స్టార్లతోనూ అదితి రావ్ హైదరి మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కి అదితీ మరీ టూమచ్ గా క్లోజ్ అయిపోతోందన్న గుసగుసలు ఇటీవల వినిపించాయి. అయితే ఈలోగానే దానికి ఇది ప్రూఫ్ అనుకోవాలా? అంటూ ఓ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇదిగో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ బడ్డీ అదితి రావు హైదరీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అదిరిపోయే ఫోజును షేర్ చేశారు. ఈ ఫోటోలో అదితీ క్యూట్ గా ఉంది..బుంగమూతి పెట్టుకుంది కూడా.

‘హే సినామికా’ చిత్రం సెట్స్ లో దిగిన ఫోటో ఇది. దుల్కార్ చిరునవ్వులు చిందిస్తుంటే.. అదితీ మాత్రం అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిందేమిటో! అదితీ ఏడుపు మొహం అంటూ ఆటపట్టిస్తున్నాడా? ఏమో.. దుల్కార్ చెప్పాలి మరి. ‘# క్రైబాబీ’ అంటూ వ్యాఖ్యను దుల్కార్ జోడించాడు..మరి ఈ ఫోటోకి అర్థం వారే చెప్పాలి. దుల్కర్ -అదితి రావు హైదారి రాబోయే తమిళ చిత్రం హే సినామికాలో జంటగా నటించారు. ఈ చిత్రం దక్షిణాది కొరియోగ్రాఫర్ బిర్ందా గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పెళ్ళి తర్వాత కూడా తాను సినిమాలలో నటిస్తానని కాజల్ పెళ్ళికి ముందే చెప్పింది కూడా. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle