newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

తేజు కోసం స్టార్ రైటర్ స్టోరీ రెడీ. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

18-10-202018-10-2020 15:47:51 IST
Updated On 18-10-2020 16:04:54 ISTUpdated On 18-10-20202020-10-18T10:17:51.499Z18-10-2020 2020-10-18T10:17:48.938Z - 2020-10-18T10:34:54.595Z - 18-10-2020

తేజు కోసం స్టార్ రైటర్ స్టోరీ రెడీ. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత సాయితేజ్ చేయనున్న మూవీ దేవా కట్ట డైరెక్షన్ లో. ఈ చిత్రానికి అంతా సెట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. పాలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించనున్నారు.

తాజాగా మరో సినిమాకి సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. స్టార్ రైటర్ తేజు కోసం మాంచి స్టోరీ రెడీ చేసారట. ఇంతకీ ఎవరా స్టార్ రైటర్ అంటే... అబ్బూరి రవి. రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా... అందరికీ కనెక్ట్ అయ్యేలా రెడీ చేసిన ఈ కథ తేజుకు బాగా నచ్చిందట. కథ విన్న వెంటనే ఓకే చెప్పాడని.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. అయితే... దీనికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదని తెలిసింది. త్వరలోనే పూర్తి వివరాలతో ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నారు.

ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సాయితేజ్.. ఇప్పుడు సరైన స్టోరీలు ఎంచుకుంటూ దూసుకెళుతున్నారు. మరి... ఈ సినిమాలతో సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle