సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?
16-01-202116-01-2021 22:44:41 IST
2021-01-16T17:14:41.114Z16-01-2021 2021-01-16T16:00:09.243Z - - 09-03-2021

అసలే పాన్ ఇండియా స్టార్..మరి ఆయన ఏ మూవీలో నటించినా అది సెన్సేషనలే అవుతుంది.అంతేనా ఆయనతో పాటు నటించే నటీనటులకు కూడా ఎనలేని పేరు వస్తుంది. ఇదిగో ఇప్పుడదే జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రాధేశ్యామ్ చిత్రంతో బిజి బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిని తర్వాత యాక్షన్..డ్రామాగా తెరకెక్కనున్నా సలార్ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఎందుకంటే ఈ సంస్థ నిర్మాణంలోనే కేజీఎఫ్ చిత్రం తెరకెక్కింది. మరి ఆ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.
కాగా సలార్ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, డైరెక్టర్‌తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రాక్‌స్టార్ యశ్ హాజరయ్యారు. సినిమా షూటింగ్‌ను ఈ నెలలో ప్రారంభించాలని మేకర్స్ యోచిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఓ లెటెస్ట్ సమాచారం అందింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొననున్నాడ. ఎలాంటి విరామం లేకుండా వరుసగా షూటింగ్లో పాల్గొననున్నాడట ప్రభాస్.
దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మొత్తం షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే ముగించాలని నిర్ణయించాడట. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, ఎంఎస్ ధోని ఫేమ్ దిషా పటానిని హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే విలన్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రభాస్ ఈ చిత్రం తర్వాత ఓం రౌత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’తో పాటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనుంది. మరి సలార్ చిత్రంలో నటించే ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. దిషా పటాని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి పరిచయం కూడా. వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించి మెప్పించిందీ భామ. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులని అలరించనుందీ బ్యూటీ.

సినిమా ఏకీ నంబర్.. రెమ్యునరేషన్ ఏకీ క్రోర్
18 hours ago

విజయశాంతిలా ఇష్యూ చేస్తున్న సమంత
20 hours ago

అన్నదమ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..?
07-03-2021

ఈ సినిమా వాళ్లకి దొబ్బేసే అలవాటు ఎప్పుడు పోతుంది
07-03-2021

జాతిరత్నంతో అనుష్క రొమాన్స్
07-03-2021

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021
ఇంకా