newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

ఢీ కాంబినేషన్.. మళ్లీ మ్యాజిక్ చేస్తారా..?

22-11-202022-11-2020 08:29:53 IST
2020-11-22T02:59:53.721Z22-11-2020 2020-11-22T02:58:53.841Z - - 06-12-2020

ఢీ కాంబినేషన్.. మళ్లీ మ్యాజిక్ చేస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మంచు విష్ణు కెరీర్ లో మరచిపోలేని సినిమా అంటే ఠక్కు న గుర్తుకువచ్చే సినిమా ఢీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా అటు విష్ణుకు, ఇటు శ్రీను వైట్లకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇంకా చెప్పాలంటే... తెలుగు ఇండస్ట్రీలోనే ఢీ సినిమా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే... హీరో విష్ణు ఈమధ్య కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా పై క్లారిటీ వచ్చేసింది. హీరో విష్ణు శ్రీను వైట్లతో సినిమా చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఢీ సినిమా వచ్చి 13 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం విశేషం. శ్రీను వైట్ల తన టీమ్ తో విష్ణుకు కరెక్ట్ గా సెట్ అయ్యే స్టోరీ రెడీ చేయించారట. కథ విని విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు అనేది త్వరలోనే తెలియచేయనున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేయడానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసారు.

ఎప్పుడంటారా..? నవంబర్ 23న విష్ణు పుట్టినరోజు. ఆరోజున ఈ సినిమాని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఢీ కాంబినేషన్ లో మూవీ అనగానే ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డం ఖాయం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని.. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరి... ఈ సినిమా హీరో విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల... ఇద్దరికీ విజయం అందిస్తుందేమో చూడాలి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle