newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

దంగల్ బేబీ దండాలు

22-11-202022-11-2020 12:54:18 IST
2020-11-22T07:24:18.064Z22-11-2020 2020-11-22T07:24:03.707Z - - 06-12-2020

దంగల్ బేబీ దండాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కొన్ని కొన్ని సార్లు అంతే. చేసిన తప్పులు వెంటాడుతుంటాయి. కానీ.. జైరా వశీం మాత్రం అలా కాదు. సినిమా చేసి.. అదేదో తప్పు చేసిన లెక్కల్లో ఉన్నట్లున్నారు. ముచ్చటగా మూడు సినిమాలు చేసింది దంగల్ బేబీ జైరా వశీం. అంతే. తర్వాత మూవీస్ లో కనిపించలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం.. దయచేసి వినండి, దయచేసి వినండి.. సోషల్ మీడియాలో నా ఫోటోలు తొలగించండి. నా ఒక్క ఫోటో కూడా లేకుండా ఉండాలి. దాని వల్ల నాకు చాలా లాభం కలుగుతుంది. ప్లీజ్ అండీ అభిమానులారా.. మీరు పొంగి పొర్లిస్తున్న అభిమానంలో నేను తడిసి ముద్దవుతున్నా. కానీ.. దాన్ని నేను తట్టుకోలేక పోతున్నా. మీరు సోషల్ మీడియాలో నా ఫోటోలు పెట్టుకుంటున్నారు షేర్లు గట్రా చేస్తున్నారు. నా ఫ్యాన్స్ కి పేజీలు కూడా ఉన్నయ్. వాటిని కూడా నా ఫోటోలతో విజయవంతంగా నడిపిస్తున్నారు. నాకు తెలుస్తోంది ఆ విషయం. ఇకపై నా ఫోటోలు పెట్టకండి ప్లీజ్ అంటోంది.

ఎందుకు పాపా ఏం కతా.. అప్పుడు ఉరికి ఉరికి సినిమాలు తీసినవ్ కదా. మా అభిమానంతో పొంగిపోయినవ్ కదా.. మేం ఫోటోలు షేర్ చేసుకుంటూ.. లైకులు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వూ ఎంజాయ్ చేసినవ్ కదా ఇప్పుడు ఈ ట్విస్టులేంటి పాపా అంటే.. ప్లీజ్ అండీ అది నా పర్సనల్. నేను జీవితంలో కొత్త అంకానికి శ్రీకారం చుట్టబోతున్నాను. మీరు మమకారంతో నా ఫోటోలు తీయండి అంటోంది.

ఏమో మరి. ఆ కొత్త అంకం అంటే ఏంటో ఎవరికీ అర్దం కావడం లేదు. పెళ్లి గానీ చేసుకుంటుందా అనే టాక్ అయితే వస్తోంది. చేసుకోబోయే హస్బండ్ కి ఇవన్నీ నచ్చడం లేదా అనే టాకూ ఉంది. మరి ఆ కొత్తగా తాను చేయబోయే పనేంటో.. ఆ పనికి ఈ ఫోటోలకి లింకేంటో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle