newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

శింబుకి కాస్ట్ లీ కార్ గిఫ్ట్..!

01-12-202001-12-2020 13:00:09 IST
Updated On 01-12-2020 13:40:58 ISTUpdated On 01-12-20202020-12-01T07:30:09.122Z01-12-2020 2020-12-01T07:30:04.820Z - 2020-12-01T08:10:58.212Z - 01-12-2020

శింబుకి కాస్ట్ లీ కార్ గిఫ్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ లాక్ డౌన్ సమయంలో పలువురు హీరోలు సిక్స్ ప్యాక్ లతో అదరగొట్టారు. తమని తాము ఫిట్ గా..ఉంచుకునేందుకు..తమ మేకోవర్ ని మార్చుకునేందుకు కఠినమైన వర్క్ వుట్స్ చేసి తెగ కష్టపడ్డారు. టాలీవుడ్ లో సందీప్ కిషన్..నాగశౌర్య..బెల్లంకొండ సాయి శ్రీనివాస్..నిఖిల్ ఇలా పలువురు సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు. వారి బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో శింబు కూడా సిక్స్ ప్యాక్ తో పాటు స్లిమ్మ్ లుక్ లో మారి తన న్యూ లుక్ ని ప్రేక్షకులకి పరిచయం చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఆయన బాడీ చూసిన ప్రేక్షకులే కాదు శింబు తల్లి ఉషా రాజేందర్ కూడా తెగ మురిసిపోయారట. అంతేనా కొడుకుకి అమూల్యమైన బహుమతిని కూడా ఇచ్చారు. ఆమె గిఫ్ట్ కి అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఉషా తన కొడుకుకు డ్రీమ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. శింబు ఇటీవల కెరీర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడ్ పెంచారు. ఎంతో క్రమశిక్షణతో మేకోవర్ చూపించారు. అతడి హార్డ్ వర్క్ కి గుర్తింపు దక్కుతోంది. రీసెంట్ గా `ఈశ్వరన్` షూటింగ్ ను పూర్తి చేశారు. 

సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలోని `మానాడు` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పాండిచ్చేరిలో షూటింగ్ సాగుతోంది. గత కొన్ని నెలలుగా శింబు వ్యక్తిగత వృత్తిపరమైన కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తన కృషికి బహుమతిగా ఉషా అతనికి మినీ కూపర్ కారు కానుకగా ఇచ్చారట. ఆకుపచ్చ మినీ కూపర్ కొద్ది రోజుల క్రితం వారి ఇంటికి వచ్చింది. శింబు తన తల్లి ఇచ్చిన ఆశ్చర్యకరమైన బహుమతిని ఎంతో ఇష్టపడ్డారట. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన కొత్త కారును ప్రయాణానికి తీసుకువెళుతున్నాడు.

తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఉషా రాజేందర్ ఆపి ఉంచిన కారు పక్కన నిలబడి కనిపిస్తున్నారు. ఆమె గులాబీల గుత్తిని పట్టుకుని కనిపించారు.ఇటీవల మానాడు బృందం ఈ చిత్రం నుండి శింబు రూపాన్ని ఆవిష్కరించే రెండు పోస్టర్లను విడుదల చేశారు. మేకర్స్ ప్రకారం అబ్దుల్ ఖాలిక్ అనే ముస్లిమ్ యువకుడి పాత్రను శింబు పోషిస్తున్నారు. సంఘంలో అరాచకులపై ఒంటరిగా పోరాటం సాగించే యువకుడి కథాంశం ఇదట. మనాడులో కల్యాణి ప్రియదర్శన్- ఎస్.జె. సూర్య- మనోజ్ భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle