newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరు సినిమా చేయనున్నారా..?

25-10-202025-10-2020 19:38:04 IST
Updated On 26-10-2020 09:19:18 ISTUpdated On 26-10-20202020-10-25T14:08:04.223Z25-10-2020 2020-10-25T14:07:58.810Z - 2020-10-26T03:49:18.722Z - 26-10-2020

డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరు సినిమా చేయనున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తుంది. అయితే... ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం, వినాయక్ డైరెక్షన్ లో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు.

అలాగే బాబీ డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేయనున్నారు. అయితే... ఇప్పుడు ఇవి కాకుండా చిరంజీవి మరో సినిమా కూడా చేయనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. అది డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో అని వార్తలు రావడంతో ఇది నిజమా కాదా అనే సందేహం. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే... వినయ విధేయ రామ అనే డిజాస్టర్ మూవీని అందించిన బోయపాటి శ్రీను. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలనుకున్నారు. చిరు - బోయపాటి కాంబినేషన్ లో మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు. అయితే... వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు ఈ మూవీ గురించి డిస్కషన్స్ జరుగుతున్నట్టు సమాచారం.

ఈ క్రేజీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని తెలిసింది. బోయపాటి ఓ వైపు బాలయ్యతో సినిమా చేస్తూనే మరో వైపు చిరుతో చేయనున్న మూవీ కోసం కథ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. చిరు ఈ మూవీకి ఓకే చెప్పినా... సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టచ్చు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle