newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

చిరు కోసం తమిళ దర్శకుడు. ఇంతకీ ఎవరు..?

21-11-202021-11-2020 17:36:34 IST
2020-11-21T12:06:34.169Z21-11-2020 2020-11-21T12:06:27.898Z - - 02-12-2020

చిరు కోసం తమిళ దర్శకుడు. ఇంతకీ ఎవరు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ చేయాలి అనుకున్నారు. మలయాళంలో విజయం సాధించిన ఈ సినిమా చిరు, చరణ్ లకు బాగా నచ్చేసింది. అంతే... రీమేక్ రైట్స్ కొనయేడం... తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయించడం జరిగింది కానీ.. డైరెక్టర్ మాత్రం సెట్ కావడం లేదు. ముందుగా ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ అనుకున్నారు. సుక్కు చేసిన ఛేంజస్ చిరుకు నచ్చలేదు. సుకుమామర్ ప్లేస్ లో సాహో సుజిత్ వచ్చాడు. సుజిత్ చేసిన మార్పులు కూడా నచ్చలేదు.

ఆ తర్వాత వివి.వినాయక్ వచ్చి చేరారు. తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వచ్చారు వినాయక్. అయితే.. వినాయక్ చేసిన మార్పులు కూడా చిరంజీవికి నచ్చలేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని కామెడీ ట్రాక్స్ చిరుకు నచ్చలేదని, అందుకే నో చెప్పారని తెలిసింది. వినాయక్ తర్వాత హరీష్ శంకర్ పేరు వినిపించింది కానీ... హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. అందుచేత చిరు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు. తాజా వార్త ఏంటంటే.. తమిళ దర్శకుడు మోహన్ రాజా పేరు వినిపిస్తోంది.

రామ్‌ చరణ్ ధృవ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.‌ ధృవ తమిళ వెర్సన్ తనిఒరువన్‌ దర్శకుడే మోహన్‌ రాజా. అప్పట్లో మోహన్ రాజా దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తారనే టాక్ వినిపించింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు చిరు సినిమా విషయంలో మోహన్ రాజా పేరు వినిపిస్తుంది. మరి.. మోహన్ రాజా అయినా ఓకే అవుతాడో..? లేక మరో డైరెక్టర్ ని రంగంలోకి దింపుతారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle