newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..

29-09-202029-09-2020 12:10:28 IST
Updated On 29-09-2020 12:14:37 ISTUpdated On 29-09-20202020-09-29T06:40:28.246Z29-09-2020 2020-09-29T06:40:21.758Z - 2020-09-29T06:44:37.323Z - 29-09-2020

కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా  దెబ్బకి చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. బిజినెస్ లు లాస్ అయ్యాయి. బతుకు తెరువు కోసం రోడ్లపై ఏదో ఒకటి అమ్ముకుంటూ జీవితం సాగిస్తున్నారు చాలా మంది. కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎక్కువగా చూపించింది. నాలుగు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో చాలా మంది సినీ పరిశ్రమ వదిలి వెళ్లిపోయారు. రోడ్లపై ఎదో ఒక చిన్న షాప్ పెట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పటికే అలా చాలా మందిని చూసాము. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో బాగా ఫేమస్ అయిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ డైరెక్టర్ కరోనా దెబ్బకి కూరగాయల షాప్ పెట్టుకొని జీవిస్తున్నారు.        

రామ్ వృక్ష గౌర్ అనే వ్యక్తి  'చిన్నారి పెళ్లికూతురు' హిందీలో బాలికా వధు సీరియల్ కి ఎపిసోడ్ డైరెక్టర్ గా, యూనిట్ డైరెక్టర్ గా చేశాడు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ నగరంలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ విషయంపై అతనిని అడగగా ఒక సినిమాకి లొకేషన్స్  కోసం ఆజంగఢ్‌కు వచ్చాను. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్ విధించారు. దాంతో నేను వెనక్కి వెళ్లలేకపోయాను. మేం ఏ సినిమా కోసమైతే వర్క్ చేస్తున్నామో, ఆ సినిమా ఆగిపోయింది. దానిపై వర్క్ స్టార్టవడానికి ఇంకో సంవత్సరం కానీ, అంతకంటే ఎక్కువే పడుతుందని మా ప్రొడ్యూసర్ చెప్పారు. ఖాళీగా ఉండలేము. బతకడానికి ఎదో ఒకటి చేయాలని అనుకున్నాను. అప్పుడు మా నాన్న చేసే వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకొని, తోపుడుబండి మీద కూరగాయలు అమ్మడం మొదలుపెట్టాను. ఈ వ్యాపారం నాకు సినీ పరిశ్రమకి రాకముందు అలవాటైందే. దీనికి నేనేం బాధపడట్లేదు అని ఆయన చెప్పాడు.

రామ్ వృక్ష తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. రైటర్ అయిన నా ఫ్రెండ్ షానవాజ్ ఖాన్ సాయంతో 2002లో ముంబైకి వెళ్లాను. టీవీ సీరియల్స్‌లో మొదట లైట్ డిపార్ట్‌మెంట్‌లో, ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఆ తర్వాత చాలా సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి, తర్వాత 'చిన్నారి పెళ్లికూతురు' (బాలికా వధు) సీరియల్‌కు ఎపిసోడ్ డైరెక్టర్‌గా, యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాను అని అన్నారు. కొన్ని సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను అని తెలిపాడు. కరోనా రాకముందు ఓ భోజ్‌పురి సినిమాకు, ఓ హిందీ సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. కానీ కరోనా వల్ల ఆ వకాశాలు పోయాయి అని తెలిపాడు. అందుకే ఇలా బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాను అని అన్నాడు.   


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle