newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

భార్య‌కి చెప్పిన త‌ర్వాత ఆ రైట‌ర్ వేధింపులు ఆపాడాట‌

15-10-202015-10-2020 10:17:08 IST
2020-10-15T04:47:08.467Z15-10-2020 2020-10-15T04:46:50.096Z - - 21-10-2020

భార్య‌కి చెప్పిన త‌ర్వాత ఆ రైట‌ర్ వేధింపులు ఆపాడాట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీటూ పై.. మ‌రో ట్వీట్ చేసి.. అంద‌రికీ మీ టూ ఉద్య‌మం గుర్తు చేసింది సింగ‌ర్ చిన్మ‌యి. కాక‌పోతే మ‌ళ్లీ అదే రైట‌ర్.. అదే క‌థ‌. కొత్త కాక‌పోయినా కొత్త‌‌గా వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ్ లిరిక్ రైట‌ర్ పై చిన్మ‌యి మీ టూ ఉద్య‌మం లేపిన విష‌యం తెలిసిందే క‌దా. ఏదో కంట్రీకి గెస్టుగా వెళ్లి.. గెస్ట్ హౌజ్ లో దిగితే.. రూమ్ కి ర‌మ్మ‌ని పిలిచాడు.. నేను వెళ్ల‌లేదు అని వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది క‌దా. అప్ప‌టి నుంచీ వైర‌ముత్తు.. ప‌రువు గంగ‌లో క‌లిసింది. త‌న‌పై అలాంటి ఆరోప‌ణ‌లే ఇంకొంతమంది చేయ‌డం.. వాటిని చిన్మ‌యి హైలైట్ చేయ‌డంతో వైర‌ముత్తు ఇజ్జ‌త్ చినిగి చాటైంది.

త‌ర్వాత కొన్నాళ్లు ఈ ఇష్యూ న‌డిచినా సైలెంట్ అయ్యారు. రెండేళ్లు అవుతుందీ.. ఇప్ప‌టికీ వైర‌ముత్తుపై వ‌స్తున్న వేధింపుల ఆరోప‌ణ‌లు త‌గ్గ‌లేదు.. ఆయ‌న ఎలాంటి క్యార‌క్ట‌ర్ ఉన్న మ‌నిషో చూడండి అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది చిన్మ‌యి. త‌న‌కి ఓ చాన‌ల్ ఎంప్లాయి మెస్సేజ్ పంపింద‌ని.. అప్ప‌ట్లో వైర‌ముత్తు త‌న‌ని ఎలా వేధించాడో మెస్సేజ్ పంపింద‌ని పోస్ట్ చేసింది చిన్మ‌యి. అస‌లు చిన్మ‌యి పోస్ట్ ఏంటో చూస్తే..

ఓ అమ్మాయి చ‌దువుకునే రోజుల్లో ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే.. వైర‌ముత్తు ఫోన్ నెంబ‌ర్ ఇచ్చాడ‌ట‌. అయినా ఆ అమ్మాయి ప‌ట్టించుకోలేద‌ట‌. కొన్నేళ్ల త‌ర్వాత ఆ అమ్మాయి త‌మిళ్ చాన‌ల్ లో ప‌ని చేస్తున్న టైమ్ లో ఏదో ప్రోగ్రామ్ కి వ‌చ్చి నెంబ‌ర్ తీసుకున్నాడ‌ట‌. పెద్ద‌గా ప‌ట్టించుకోని అమ్మాయి నెంబ‌ర్ ఇచ్చిందట‌. అప్ప‌టి నుంచి వైర‌ముత్తు త‌న‌కి ఫోన్ లు మెస్సేజ్ లు చేసే వాడ‌నీ.. త‌న ప్లేస్ కి ర‌మ్మ‌ని అడిగేవాడ‌ని.. గంట‌కి వంద‌సార్లు ఫోన్లు మెస్సేజ్ లు చేసి విసిగించే వాడ‌ట‌. నెంబ‌ర్ మార్చినా.. ఎలాగోలా త‌న నంబ‌ర్ తెలుసుకుని ఫోన్ లు చేసే వాడ‌ట‌. చివ‌రికి చాన‌ల్ యాజ‌మాన్యం ఇన్వాల్వ్ అయ్యి వైర‌ముత్తు భార్య‌కి చెప్పిన త‌ర్వాత కంట్రోల్ అయ్యాడ‌ని.. చిన్మ‌యికి మెస్సేజ్ చేసింది. అయితే.. ఈ విష‌యాన్ని బ‌య‌టకి చెప్ప‌డానికి ఆ అమ్మాయి వాళ్ల పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇన్నాళ్లు చెప్ప‌లేక పోయింది. ఇదే విష‌యాన్ని చిన్మ‌యి మెన్ష‌న్ చేస్తూ.. త‌న వివ‌రాలు బ‌య‌టికి తెలియకుండా.. ఇష్యూకి సంబంధించిన స‌మాచారం మాత్ర‌మే పోస్ట్ చేసింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle