newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

చాందినికి ఈ సినిమా అయినా సక్సస్ అందిస్తుందా..?

18-10-202018-10-2020 11:21:42 IST
Updated On 18-10-2020 11:32:26 ISTUpdated On 18-10-20202020-10-18T05:51:42.724Z18-10-2020 2020-10-18T05:49:56.330Z - 2020-10-18T06:02:26.448Z - 18-10-2020

చాందినికి ఈ సినిమా అయినా సక్సస్ అందిస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చాందిని.. కెరీర్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తెలుగమ్మాయి. ఈ అమ్మాయి తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది కానీ.. ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. తాజాగా నటించిన చిత్రం కరల్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాన్ సరసన చాందిని నటించింది. ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఉండడంతో టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా విజయం అందిస్తుందని నమ్ముతున్నారు.

ఈ నెల 23న కలర్ ఫోటో ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ చాందిని మాట్లాడుతూ... పలు విషయాలు తెలిపింది. తనకు డైరెక్టర్ సందీప్‌ రాజ్‌ కలర్‌ ఫొటో కథ చెప్పగానే, వెంటనే అంగీకరించానని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తోన్న సుహాస్ కొత్త హీరో అని విషయాన్ని తాను ఆలోచించలేదని తెలిపింది. కారణం ఏంటంటే... ప్రస్తుతం సినీ ప్రేక్షకులు విభిన్న కథలతో రూపొందే సినిమాలను ఆదరిస్తున్నారని... ఈ సినిమా కథ 1990 కాలం నేపథ్యంలో కొనసాగుతూ వర్ణవివక్ష ప్రధానాంశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది.

ఈ సినిమాలో పాత్రకు తగ్గట్గుగా 1990 నాటి అమ్మాయిలా, స్వతంత్ర భావాలు కలిగిన పల్లెపడుచులా కనపడతానని తెలిపింది. ఇప్పటి వరకు సరైన సక్సస్ రాలేదు. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుందని గట్టి నమ్మకం ఉందన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle