newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

విజయ్ - పూరి మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో

19-10-202019-10-2020 15:51:03 IST
Updated On 19-10-2020 16:29:52 ISTUpdated On 19-10-20202020-10-19T10:21:03.053Z19-10-2020 2020-10-19T10:20:50.174Z - 2020-10-19T10:59:52.042Z - 19-10-2020

విజయ్ - పూరి మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైటర్. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. ముంబాయిలో చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. బ్యాంకాక్, ఇటలీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అది ఏంటంటే... ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నారని. ఇంతకీ ఎవరా బాలీవుడ్ సీనియర్ హీరో అంటే.. సునీల్ శెట్టి. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. పైగా సునీల్ శెట్టి విజయ్ దేవరకొండ కి ఫాదర్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమా గురించి ఈమధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతం టీమ్ అంతా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా అప్ డేట్ రానుందని తెలిసింది.

అప్పుడు ఫైటర్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమ్మర్ లో ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న పూరి ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడని ఆశిద్దాం.

మహేష్ - పూరి కాంబినేషన్ సెట్ అయ్యిందా..?


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle