newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఓ పక్క నెపోటిజంపై పోరాటం..మరో పక్క స్టార్ హీరో తనయుడి ఎంట్రీ..

18-10-202018-10-2020 16:03:42 IST
2020-10-18T10:33:42.735Z18-10-2020 2020-10-18T10:33:40.541Z - - 25-10-2020

ఓ పక్క నెపోటిజంపై పోరాటం..మరో పక్క స్టార్ హీరో తనయుడి ఎంట్రీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున్న వారసత్వంపై పోరాటమే జరిగింది..ప్రస్తుతం జరుగుతోంది కూడా. ఈ వారసత్వం వల్ల ఎంతో మంది బలి అవుతున్నారని..నిజమైన టాలెంట్ ఉన్నవారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కకుండా పోతున్నాయని పలువురు వాదిస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో మరో స్టార్ హీరో వారసుడు వెండితెరపపై మెరవనున్నాడట. ఆ స్టార్ హీరో బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్. ఆయన తనయుడు హీరోగా పరిచయం కానున్నాడని టాక్.

నటవారసత్వం(నెపోటిజం)పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. నటవారసుల్ని కాపాడేందుకు ఇన్ సైడర్స్ ని ఉద్ధరించేందుకు ఒక సెక్షన్ బాలీవుడ్ మాఫియా ఔట్ సైడర్ ప్రతిభను తొక్కేస్తోందన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం దీనిపై అసాధారణమైన డిబేట్ సాగింది. సరిగ్గా ఇలాంటి సమయంలో బాలీవుడ్  స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడన్న వార్త హీట్ పెంచుతోంది. జునైద్ ఖాన్ మలయాళ చిత్రం ఇష్క్  హిందీ రీమేక్ లో నటించనున్నారని సమాచారం.

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. జర్మన్ నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెచ్ట్ నాటకం `మదర్ కరేజ్ అండ్ హర్ చిల్డ్రన్.. క్వాసర్ ఠాకూర్ `పదంసీ` నాటకంతో తన థియేటర్ వృత్తిలోకి అడుగుపెట్టిన జునైద్... గత మూడేళ్లుగా థియేటర్ డ్రామాలో నటుడిగా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. లాస్ ఏంజిల్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థి గానూ అతడి గురించి పరిచయం అవసరం లేదు.

ఎ ఫార్మింగ్ స్టోరీ... ఎ ఫ్యూ గుడ్ గుడ్ మెన్... మెడియా...బోన్ ఆఫ్ కన్టెన్షన్ వంటి ప్రఖ్యాత నాటకాల్లో జునైద్ నటించాడు. ఇంత శిక్షణ అనంతరం జునైద్ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మలయాళ చిత్రం ఇష్క్ హిందీ రీమేక్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఇందులో షేన్ నిగమ్- ఆన్ షీటల్ నటించారు. హిందీ రీమేక్ ను నీరజ్ పాండే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. నటవారసత్వం కార్చిచ్చులో స్టార్ హీరో పుత్రరత్నం ఎంట్రీనా? అంటూ అప్పుడే ఒక సెక్షన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమవుతుందో..మరి ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle