newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

మోడీ దాకా హీరోయిన్ ల కొట్లాట‌..!

11-10-202011-10-2020 16:17:47 IST
2020-10-11T10:47:47.339Z11-10-2020 2020-10-11T10:47:38.635Z - - 21-10-2020

మోడీ దాకా హీరోయిన్ ల కొట్లాట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆడవారిపై కామెంట్లు చేసిన‌ట్లే ఉంటుంది కొంత‌మంది హీరోయిన్ లు చేసే య‌వ్వారం. వాళ్లు కూడా ఆడాళ్లేగా అంటూ సోష‌ల్ మీడియాలో అడ్డ‌మైన సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. పాయ‌ల్ ఘోష్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇష్యూ హీటెక్కింది. బాలీవుడ్ పేజ్ త్రీలో హాట్ టాపిక్ అయింది. కంప్లైంట్ ఇచ్చింది హాట్ బ్యూటీ కావ‌డం.. చేసింది క్రేజీ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ పై కావ‌డంతో బ‌జ్ వ‌చ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి సుశాంత్ సింగ్ డెత్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ కామెంట్స్ వ‌స్తున్నాయి. మాఫియా న‌న్ను చంపేలా ఉంది. న‌న్ను కూడా చంపేసి సుశాంత్ సింగ్ లా చేస్తారేమో అని హాట్ క‌మెంట్స్ చేస్తోంది పాయ‌ల్ ఘోష్.

విష‌యం ఏంద‌య్యా అంటే. అనురాగ్ క‌శ్య‌ప్ అనే వ‌ర్సెటైల్ డైరెక్ట‌ర్.. పాయ‌ల్ ఘోష్ తో మిస్ బిహేవ్ చేశాడ‌ట‌. నిజ‌మో కాదో కానీ.. పాయ‌ల్ ఘోష్ కంప్లైంట్ ఇది. నేరుగా వెళ్లి పోలీస్ స్టేష‌న్ లో కంప్లైంట్ చేసింది పాయ‌ల్. చేస్తూ చేస్తూ రిచా చ‌ద్దా పేరు కూడా ఇన్వాల్వ్ చేసింది. రిచా నాకు బాగా క్లోజ్ అని క‌శ్య‌ప్ అన్న‌ట్లు.. కంప్లైంట్ లో రాసింది. మీరు మీరు గొడ‌వ ప‌డి నా పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేశావ్.. నా ఇజ్జ‌త్ ఎందుకు తీస్తున్న‌వ్ అంటూ.. రిచా వెళ్లి కోర్టులో పిటిష‌న్ వేసింది.

నా కంప్లైంట్ ఎవ‌రూ రెస్పాండ్ అవ‌డం లేదు అని.. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ద‌గ్గ‌ర‌కి వెళ్లింది పాయ‌ల్. వ‌చ్చి ఊరుకోకుండా ట్వీట్ల‌పై ప‌డింది. నాకు సెక్యూరిటీ కావాలి.. ముంబై ఇండ‌స్ట్రీలో మాఫియా ఉంది. వాళ్లు న‌న్ను చంపేసి.. సూసైడ్ లా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంటూ ట్వీట్లు చేసింది. నాకు ర‌క్ష‌ణ ఇవ్వండి సార్ అంటూ పీఎం మోడీకి, అమిత్ షాకి కూడా ట్వీట్ చేసింది. దీంతో ట్వీట్ వార్ స్టార్ట్ అయింది. ట్వీట్ ఓపెన్ చేసిన‌ప్పుడ‌ల్లా త‌లా ఓ ట్వీటూ వేస్తూ ఇష్యూకి హైప్ ఇస్తున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle