బిగ్ బాస్ రెండు వారాలు పొడిగిస్తున్నారా..?
21-11-202021-11-2020 18:08:11 IST
2020-11-21T12:38:11.260Z21-11-2020 2020-11-21T12:38:07.058Z - - 21-01-2021

పాయింట్ టు పాయింట్. అబ్జర్వేషన్. గేమ్ ఎలా నడుస్తుంది. ఇంట్రస్టింగ్ గా ఉందా లేదా.. టీఆర్పీ వస్తుందా లేదా. అంతే. బస్.. అంతకు మించి ఏముంటుంది చెప్పండి. అందుకే.. ఇప్పుడు ఈ కొత్త డిస్కషన్ బయటికి వస్తుంది. అనుకున్నదానికంటే.. బిగ్ బాస్ హౌజ్ లో కొన్నాళ్లు ఎక్కువ ఉండేలా ఉందట సీన్. క్రికెట్ టై అయితే.. లాస్ట్ లో ఇంకో ఓవర్ వేసినట్లు.. మరి వీరిని టై చేసి.. ఇంకో ఓవర్ వేస్తారా.. ఓట్ల లెక్కని పట్టించుకోకుండా.. గేమ్ ఇంట్రస్టింగ్ గా ఉంది అని పెంచుతారా.. లేదంటే మరే రీజన్ ఏదైనా చెబుతారా. ఇది కాస్త డౌట్ గానే ఉంది. కానీ.. రెండు వారాలు పెంచితే మాత్రం.. హౌజ్ లో ఉన్నోళ్లకి చుక్కలు కనిపించడం గ్యారంటీ. ఎందుకంటే.. ఎప్పటిలా కాకుండా ఈ సీజన్ లో పాల్గొన్న వాళ్లు ఆల్రెడీ రెండు వారాలు ఎక్కువగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నట్లే లెక్క. ఎందుకంటే.. వాళ్లని హౌజ్ లోకి తీసుకొచ్చే ముందు క్వరంటైన్ లో ఉంచారు. అది కూడా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నట్లే కదా. ఎవరితో మాట్లాడకుండా.. టచ్ లో ఉండకుండా కలవకుండా.. కాస్త దూరం పెట్టారు. మళ్లీ రెండు వారాలు అంటే.. మొత్తం నెల రోజులు ఎక్కువ స్పెండ్ చేసినట్లే.
మరి సడన్ గా రెండు వారాలు పెంచడం అనే పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎవరికీ అర్దం కాని ప్రశ్నే. కానీ.. ఇది సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది. యాక్చువల్ గా.. ముందు నడిచిన మూడు సీజన్ల కంటే.. నాలుగో సీజన్ కాస్త ఢల్ గా నడిచింది. ఫస్ట్ లో ఎవర్రా బాబూ వీళ్లంతా అనుకున్నారు. గంగవ్వ, లాస్యలు తప్ప.. పెద్దగా తెలిసిన వాళ్లు తక్కువే. కానీ.. రీసెంట్ గా ఏదో జరిగింది. బిగ్ బాస్ క్రియేటివిటీ పెరిగిందా.. కంటెస్టంట్లు ఆడే గేమ్ ఆడియన్స్ కి నచ్చిందా అనేది వదిలేస్తే.. జనం బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రేటింగ్స్ కూడా పెరిగాయట. సో.. మొదట్లో ఢల్ గా ఉన్న మందం.. ఇప్పుడు హై లో ఉన్న షోని యూజ్ చేసుకోవాలి అనే ప్లాన్ తోనే ఈ పాయింట్ తెరపైకి వచ్చిందంట. కాకపోతే.. మరో వైపు మాత్రం.. బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ గ్రాండ్ ఫినాలే ని ఎంత గ్రాండ్ గా చేయాలి అనే లెక్కల్లో కూడా బిజీగా ఉన్నారట. చూడాలి మరి.. ఎలా ప్లాన్ చేస్తారో.. షో టైం పెంచుతారో లేదో.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్
2 hours ago

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్
3 hours ago

వదలం బొమ్మాళీ వదలం.. దండాలు పెట్టినా వదలం డ్రగ్స్ బేబీ
5 hours ago

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్
15 hours ago

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'
17 hours ago

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్
15 hours ago

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్
20 hours ago

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ
18 hours ago

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్
21 hours ago

తమన్ తానా తందానా.. కాపీ ఘాటు బానే తగిలినట్లుంది
a day ago
ఇంకా