newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

'భాగీ4'.. ఈ సారి ఏ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారో?!

29-10-202029-10-2020 22:39:55 IST
Updated On 30-10-2020 07:20:26 ISTUpdated On 30-10-20202020-10-29T17:09:55.358Z29-10-2020 2020-10-29T17:09:48.128Z - 2020-10-30T01:50:26.725Z - 30-10-2020

'భాగీ4'.. ఈ సారి ఏ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారో?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు సినిమాలు హిందీలోకి..హిందీ చిత్రాలు తెలుగులోకి రీమేక్ కావడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారాయి. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..త్రిష జంటగా నటించిన చిత్రం హిందీలోకి భాగీ పేరుతో రీమేక్ అయింది. అక్కడా ఎవరేజ్ గా ఆడింది ఈ చిత్రం.కాగా 'భాగీ' ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు బ్యాడ్ టాక్ నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకున్నా కలెక్షన్స్ వైస్ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

అందుకే ఇప్పుడు 'భాగీ' సిరీస్ లో నాలుగో చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యారు. అయితే 'భాగీ' సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ సౌత్ సినిమాలకు రీమేక్ గా తెరకెక్కినవే. 'భాగీ'(2016) సినిమా తెలుగులో ప్రభాస్ సూపర్ హిట్ సినిమా 'వర్షం' కి హిందీ రీమేక్ గా వచ్చింది. నాడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రానికి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 'భాగీ 2'(2018) తెలుగు హిట్ సినిమా 'క్షణం' కి రీమేక్ గా రూపొందింది. సాజిద్ నాడియాద్వాలా నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 'భాగీ 3'(2020) మూవీ 'వేట్టై'(తెలుగులో 'తడాఖా') చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా అహ్మద్ ఖాన్ తెరకెక్కించారు. ప్రభాస్ సాహోకు షాకింగ్ రేటింగ్..!

కాగా ఇప్పుడు 'భాగీ 4' చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నారు. నాడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సాజిద్ నాడియాద్వాలా నిర్మించే ఈ చిత్రానికి 'భాగీ 2' 'భాగీ 3' డైరెక్టర్ అహ్మద్ ఖాన్ తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ లో కూడా టైగర్ ష్రాఫ్ హీరోగా కొనసాగనున్నారు. ఇప్పటికే సాజిద్ తన రచయితల బృందంతో కలసి స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట. ఇందులో కూడా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇప్పటికే మూడు సౌత్ మూవీస్ ని రీమేక్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన 'భాగీ' ఫ్రాంచైజీలో ఈసారి ఏ సౌత్ మూవీని రీమేక్ చేస్తున్నారో అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle