newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

అభిమానులకి లేఖ వ్రాసిన బాలయ్య

08-06-202108-06-2021 16:14:41 IST
2021-06-08T10:44:41.432Z08-06-2021 2021-06-08T10:44:30.746Z - - 14-06-2021

అభిమానులకి లేఖ వ్రాసిన బాలయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సినిమాలు హిట్లూ, ఫ్లాఫులతో సంభంధం లేకుండా హీరో నందమూరి బాలక్రిష్ణని అభిమానించే అభిమానగణం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. బాలయ్య సినిమా విడుదలయ్యి అది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే బాలయ్య అభిమానులకి పండగే పండుగ, సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే వుంటారు. మరోవైపు బాలయ్య సైతం తన అభిమానులకు ఏ కష్టం వచ్చినా వారికి సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా  ఈ నెల 10న బాలయ్య బర్త్‌డే. పుట్టిన రోజు అనగానే ఎందరో ఫ్యాన్స్‌ ఆయనను కలవాలని, విషెస్‌ చెప్పి ఫొటో దిగాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కరోనా ఉధృతి కారణంగా ఎవరూ తనను కలిసేందుకు రావద్దని బాలయ్య సోషల్‌ మీడియాలో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన లేఖలో "నా ప్రాణ సమానులైన అభిమానులకు ప్రతి ఏటా జూన్ 10వ తేదీ పుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అంత మంచిది కాదు. మీ అభిమానం వల్లే నేను ఇంతటివాడినయ్యాను. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సులు లేవు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేవు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవరూ నా వద్దకు రావద్దని మరీ మరీ తెలియజేస్తూ.. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను" అని బాలకృష్ణ పోస్ట్‌ పెట్టాడు.

ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా తనని అభిమానించే అభిమానుల క్షేమాన్ని కోరి, సహృదయంగా వ్రాసిన ఈ లేఖకి బాలయ్య అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

   25 minutes ago


ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

   2 hours ago


హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

   3 hours ago


ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

   9 hours ago


పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

   13-06-2021


విజయ్ దేవరకొండ తన  ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

విజయ్ దేవరకొండ తన ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

   13-06-2021


దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

   12-06-2021


రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

   12-06-2021


ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

   12-06-2021


ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

   11-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle