newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

29-09-202029-09-2020 22:54:26 IST
2020-09-29T17:24:26.116Z29-09-2020 2020-09-29T17:24:22.125Z - - 25-10-2020

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ బాలయ్య బర్త్ డేకి రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. దీంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే... బాలయ్యతో సినిమా చేయాలని డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి సినిమా రూపొందింది. ఈ సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆతర్వాత మళ్లీ బాలయ్య - వినాయక్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. వర్కవుట్ కాలేదు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని సి.కళ్యాణ్ నిర్మించాలి అనుకున్నారు. బాలయ్యకు వినాయక్ కొన్ని కథలు చెప్పారు కానీ.. ఏ కథ కూడా బాలయ్యకు నచ్చలేదు. దీంతో సరైన స్టోరీ సెట్ కాకపోవడం వలన ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. వినాయక్ ప్రస్తుతం చిరంజీవితో లూసీఫర్ రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు.

అయితే.. వినాయక్ ఓ వైపు చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తూనే మరో వైపు బాలయ్యతో కూడా సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈసారి పక్కాగా స్టోరీ రెడీ చేయించి బాలయ్యతో  ఓకే అనిపించాలి అని పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేయించారని టాక్. త్వరలో బాలయ్యకు వినిపించాలి అనుకుంటున్నారట. మరి.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేదా..? అనేది చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle