newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

06-12-202106-12-2021 19:28:01 IST
2021-12-06T13:58:01.058Z06-12-2021 2021-12-06T13:57:50.886Z - - 19-01-2022

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా ‘అఖండ’ మూవీ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు. ఓవర్ సీస్ లో కూడా అఖండ హవా కొనసాగిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్‌, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 2న విడుదలైంది. 

ఈ చిత్రం తొలి రోజు.. తొలి ఆట నుంచే విశేష స్పందన లభించింది. అత్యధిక వసూళ్లు రాబడుతూ రికార్డు సృష్టిస్తోంది. కొవిడ్‌ సెకండ్‌ తర్వాత ఓవర్సీస్‌లో (విడుదలైన తొలిరోజు) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం.. ఈ సినిమా కెనడాలో (ప్రీమియర్‌తో కలిపి) సుమారు రూ. 13లక్షలు, యుకేలో సుమారు రూ. 32 లక్షలు, ఆస్ట్రేలియాలో సుమారు రూ. 52 లక్షలు రాబట్టిందని పేర్కొన్నారు. అమెరికాలో (మూడు రోజులు కలిపి) సుమారు రూ.5 కోట్లు కలెక్ట్‌ చేసిందని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం అఖండ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాలుగు రోజుల కలెక్షన్లు దాదాపు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని వార్తలు వస్తున్నాయి.

కరోనా నుండి కోలుకున్న నటి కీర్తి సురేష్

కరోనా నుండి కోలుకున్న నటి కీర్తి సురేష్

   5 hours ago


హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల పై అర్జీవీ వరుస ట్విట్లు

హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల పై అర్జీవీ వరుస ట్విట్లు

   10 hours ago


సూర్య నిర్మింఛి నటించిన జై భీమ్ చిత్రానికి మరో గౌరవం

సూర్య నిర్మింఛి నటించిన జై భీమ్ చిత్రానికి మరో గౌరవం

   10 hours ago


ధనుష్ అభిమానులకు షాక్.. విడాకులు తీసుకొనున్న ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్

ధనుష్ అభిమానులకు షాక్.. విడాకులు తీసుకొనున్న ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్

   18 hours ago


ఊ అంటావా మావా.. ఐటెం సాంగ్ కి సమంత రెమ్యునరేషన్ ఏంతంటే..

ఊ అంటావా మావా.. ఐటెం సాంగ్ కి సమంత రెమ్యునరేషన్ ఏంతంటే..

   17-01-2022


హాస్పిటల్ లో అడ్మిట్ అయిన లోకనాయకుడు కమల్ హాసన్

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన లోకనాయకుడు కమల్ హాసన్

   17-01-2022


బీచ్ లో ఓపెన్ టాప్ జీప్ నడిపిన నందమూరి బాలకృష్ణ

బీచ్ లో ఓపెన్ టాప్ జీప్ నడిపిన నందమూరి బాలకృష్ణ

   17-01-2022


బాలీవుడ్ స్టార్ హీరో షూటింగ్ లో అగ్నిప్రమాదం

బాలీవుడ్ స్టార్ హీరో షూటింగ్ లో అగ్నిప్రమాదం

   16-01-2022


రావణాసుర షూటింగ్ ప్రారంభం

రావణాసుర షూటింగ్ ప్రారంభం

   15-01-2022


సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి

సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న మెగాస్టార్ చిరంజీవి

   13-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle