newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

మరో కథకు ఓకే చెప్పిన బాలయ్య?

18-10-202018-10-2020 17:21:13 IST
Updated On 18-10-2020 17:31:45 ISTUpdated On 18-10-20202020-10-18T11:51:13.261Z18-10-2020 2020-10-18T11:51:07.223Z - 2020-10-18T12:01:45.151Z - 18-10-2020

మరో కథకు ఓకే చెప్పిన బాలయ్య?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నందమూరి నటసింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన షూటింగ్ ను వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా తర్వాత బాలయ్య బి.గోపాల్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

అలాగే పూరి కూడా బాలయ్య కోసం కథ రెడీ చేసారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ కూడా బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు బాలయ్య ఓ కథకు ఓకే చెప్పారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఈ కథా రచయిత ఎవరంటే... ఎం.రత్నం. ఇప్పటికే ఎమ్ రత్నం స్క్రిప్ట్ ను బాలయ్యకు చెప్పారట. బాలయ్యకు కథ నచ్చిందని.. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ కథను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే బాలయ్య ఈ కథను ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందో ఫైనల్ చేస్తారని సమాచారం.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle