newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

నన్ను నేను చూసుకున్నాక గుండె పగిలినంత పనైంది

29-10-202029-10-2020 17:19:29 IST
Updated On 29-10-2020 17:19:25 ISTUpdated On 29-10-20202020-10-29T11:49:29.653Z29-10-2020 2020-10-29T11:48:53.392Z - 2020-10-29T11:49:25.506Z - 29-10-2020

నన్ను నేను చూసుకున్నాక గుండె పగిలినంత పనైంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బొద్దుగుమ్మలంతా స్లిమ్మ్ గా మారి నాజూకు రూపంతో మెరిసిపోతున్నారు. లాక్ డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయం కూడా అలాంటి వారికి చాలా ఉపయోగపడింది. అసలే రంగుల ప్రపంచం అందుకే నాజూకు రూపానికి విలువెక్కువ. బరువు పెరగడానికి రకరకాల కారణాలు. హీరోయిన్స్ అయితే సరిగా అవకాశాల్లేక న్యూనతలోకి వెళ్లినా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ కాదని అంటోంది హీరోయిన్ అవికా గోర్. తన అధిక బరువు సమస్య సహజసిద్ధమైనదేనట. తాజాగా అవికా గోర్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ వ్యవహారంపై సుదీర్ఘంగానే నోట్ రాసింది.

ఈ కొద్ది గ్యాప్ లోనే దాదాపు 13 కిలోల బరువు తగ్గిందట ఈ 23 ఏళ్ల బ్యూటీ. “గత సంవత్సరం ఒక రాత్రి ఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను అద్దంలో నన్ను చూసుకున్నాక గుండె పగిలింది. నేను చూసినదాన్ని నేను ఇష్టపడలేదు. పెద్ద చేతులు... కాళ్ళు.. బాగా ఊబెక్కిన బొడ్డు. నేను తట్టుకోలేకపోయాను. ఇది అనారోగ్యం (థైరాయిడ్.. పిసిఓడి మొదలైనవి) కారణంగానే. అందుకే నేను బరువు పెరిగాను. అది నా నియంత్రణలో లేదు. కానీ నేను ఏదైనా తప్పు చేశానా? అంటే.. ప్రతిదీ దొరికిందల్లా తిన్నందున ఇలా అయ్యింది. పైగా నేను అస్సలు వ్యాయామం చేయలేదు. మా శరీరాలు బాగా చికిత్స పొందటానికి అర్హమైనవి కానీ నేను దానిని గౌరవించలేదు” అంటూ తన తప్పుల్ని తానే తెలుసుకుంది ఈ భామ.

అందుకే అధికబరువు అసురక్షితంగా భావించిందట. ఆ తర్వాతే పెనుమార్పు. నన్ను నేను చూసే తీరు నాకు నచ్చలేదు.. నేను డ్యాన్స్ ను పూర్తిగా ఆనందించలేకపోయాను. నేను ఎలా సరిగ్గా కనిపించాలి? అంటూ బాధపడ్డాను. బయటివారికి నన్ను చెడుగా చూస్తారని కలతకు గురయ్యాను. ఇటువంటి అభద్రతాభావాలు అన్ని సమయాలలో నెత్తిపై శివతాండవమాడతాయి. అవి మనకు అలసట చిరాకును కలిగిస్తాయి... అంటూ చాలా విచారకరమైన విషయాల్ని చెప్పింది.

బరువు తగ్గాక మాత్రం ఇప్పుడు తన చర్మంలో సుఖం ఉందని చెప్పింది.

“నేను ఈ ఉదయం అద్దంలో నన్ను చూసుకున్నాను. దూరంగా చూడవలసిన అవసరం కలగలేదు. నేను నన్ను చూసి నవ్వి... నేను అందంగా ఉన్నానని నాకు చెప్పుకున్నాను. మనందరికీ ఆఫర్లు చాలా ఉన్నాయి. మనం చేయలేని దాని గురించి విచారించకుండా.. చురుకుగా పని చేయాలి. ఈ రోజు మునుపటిలా నేను ప్రశాంతంగా ఉన్నాను`` అంటూ కాస్త ఎమోషనల్ గానే నోట్ రాసింది. నేను నా 100 శాతం ఇవ్వకపోయినా ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను వృత్తిపరంగా మంచి పని చేస్తున్నా కానీ నేను సంతోషంగా లేకపోవడానికి బరువు కారణమైంది. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా నా 100 శాతం బాగయ్యాను ఇపుడు. మనసు బాగోనప్పుడు స్క్రీన్ ప్లే రాయడానికి ప్రయత్నించాను. కాని అప్పుడు దానిపై దృష్టి పెట్టలేకపోయాను. అయితే నా పుట్టినరోజు (జూన్ 30)న నావారందరికీ 100 శాతం రుణపడి ఉంటాను.. అంటూ సుదీర్ఘ ఎమోషనల్ నోట్ ని రాసింది అవికా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle