newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..

29-09-202029-09-2020 11:45:18 IST
Updated On 29-09-2020 11:51:11 ISTUpdated On 29-09-20202020-09-29T06:15:18.250Z29-09-2020 2020-09-29T06:15:16.272Z - 2020-09-29T06:21:11.051Z - 29-09-2020

అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హాలీవుడ్ లో అవతార్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. టైటానిక్ లాంటి వరల్డ్ హిట్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అవతార్ అనే పెద్ద భారీ బడ్జెట్ సినిమా తీశాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించింది. ఆ తర్వాత అవతార్ కి సీక్వెల్ తీస్తున్నాను అని కూడా చెప్పి వర్క్ మొదలుపెట్టాడు. తాజాగా అవతార్ 2 చిత్రీకరణ పూర్తయిందని, అలాగే అవతార్ 3 చిత్రీకరణ కూడా 95 శాతం పూర్తయిందని హాలీవుడ్ లెజెండరీ దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సంగతిని చెప్పారు కామెరూన్. 

అవతార్ తర్వాతి భాగాలలో బ్యాక్-టు-బ్యాక్ చిత్రీకరణలో భాగంగా మూడవ భాగం కూడా 95 శాతం పూర్తయిందని కామెరాన్ తెలిపారు. కోవిడ్ ప్రతి ఒక్కరినీ కొట్టినట్లు మమ్మల్ని కూడా కొట్టింది. మేం నాలుగున్నర నెలల పాటు సినిమా తీయలేకపోయాం. దాని ఫలితంగా మేము 2022 డిసెంబరు వరకూ విడుదల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమవుతుంది సినిమా అని అన్నారు. అవతార్ 2ను పంపిణీ చేసిన రోజు అవతార్ 3ని కూడా  పూర్తి చేసే పనిలో ఉంటాను అని కామెరూన్ అన్నారు.

అవతార్ మొదటి భాగం మాదిరిగానే న్యూజిలాండ్లో అవతార్ సీక్వెల్స్ను చిత్రీకరించాలని నిర్ణయించుకోవడం, అది కుదరడం నా అదృష్టమని కామెరాన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో న్యూజిలాండ్ ఆదర్శంగా ఉంది. ఇది సురక్షితమైన వాతావరణంలో చిత్రీకరణకు సాయపడింది అని కామెరూన్ అన్నారు. ఈ సారి మరి కొంతమంది హాలీవుడ్ స్టార్లను ఈ చిత్రంలో భాగం చేయనున్నారు. అవతార్ 2 చిత్రాన్ని డిసెంబర్ 17, 2021న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కాని లాక్‌డౌన్ వలన చాలా సమయం వృధాకావడంతో చిత్రాన్ని డిసెంబర్16, 2022లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు కామెరూన్. ఆ తర్వాత అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20,2024న రిలీజ్ చేస్తామన్నారు. ఆ తరువాత అవతార్ 4, 5 కూడా తీస్తానని చెప్పడం విశేషం.     


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle