newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

20-09-202120-09-2021 18:48:42 IST
Updated On 20-09-2021 19:34:45 ISTUpdated On 20-09-20212021-09-20T13:18:42.830Z20-09-2021 2021-09-20T13:18:03.297Z - 2021-09-20T14:04:45.109Z - 20-09-2021

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇందుకు గాను ప్రయత్నాలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. సినిమా టిక్కెట్లు తదితర సమస్యలని ఎపి ప్రభుత్వంతో చర్చించేందుకు సోమవారం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. చర్చ అనంతరం మంత్రి పేర్ని నాని స్పందించారు. 

ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించాం. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేయాలి. అందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు ‘ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది’ అని అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యమైనంత మేర సానుకూలంగా స్పందించామని ఆయన అన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉందని, సోదరభావంతో ఆయనని చూస్తారని పెర్ని నాని అన్నారు. ఇక త్వరలో ఆన్ లైన్ మూవీ టిక్కెట్ విధానం ఎపిలో మొదలు కానున్నట్లు స్పష్టం అయ్యింది. ఈ విధానం వల్ల బ్లాక్ టికెట్ మార్కెట్ కి ఆస్కారం ఉండదని, ప్రేక్షకుల జేబులు ఖాళీ చేసే ఈ బ్లాక్ టికెట్ మార్కెట్ సమూలంగా తుడిచిపెట్టుకు పోవడం ఈ ఆన్ లైన్ టిక్కెట్ విధానం వల్లనే సాధ్యం అవుతుందని సినీ ప్రముఖులు సైతం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   an hour ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   5 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   6 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   8 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   8 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   21 hours ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle