హైదరాబాద్లో అనుష్క.. ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్
13-01-202113-01-2021 18:57:57 IST
2021-01-13T13:27:57.400Z13-01-2021 2021-01-13T13:08:10.586Z - - 17-01-2021

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఏమయిపోయింది..ఎక్కడికి వెళ్లిపోయింది..ఆమె ఆచూకీ ఈ మధ్య కనిపించడంలేనేలేదు. జీరోసైజ్ కోసం బొద్దుగా మారి మళ్ళీ జీరోసైజ్ కి వచ్చేందుకు నానాతంటాలు పడుతోంది స్వీటీ. ఆమె నటించనున్న సినిమాల జాడకూడా కానరావట్లేదు. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేసిన చిత్రం నిశ్శబ్ధం. ఆ మూవీ తర్వాత ఇప్పటి వరకూ ఏ మూవీకి కమిట్ అవ్వలేదీ భామ. దాంతో అనుష్క మూవీ గురించి ఎదురుచూస్తున్నారట ఆమె ఫ్యాన్స్. అయితే ఈ బ్యూటీ హైదరాబాద్ లో కనిపించింది.
అయితే.. ఆ న్యూస్ కన్నా ముందు తనే దర్శనమిచ్చింది అనుష్క. సినిమాల మాటేమో గాని కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా అభిమానులను నిరాశకు గురిచేసిన స్వీటీ.. హైదరాబాద్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత కనిపించడంతో మీడియాతోపాటు అభిమానులు ఫొటోల మీద ఫొటోలు తీసుకున్నారు. మరి అనుష్క ఎలా ఉందో తెలుసా.. బ్లాక్ కలర్ డ్రెస్..చేతిలో ఫోన్..ముఖానికి మాస్క్ ఇలా మెరిసిందీ జేజమ్మ. ఈ పిక్ లో అనుష్క కాస్త బొద్దుగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ వచ్చిందంటే ఏదో సినిమా కోసమే అనుకుంటున్న ఫ్యాన్స్.. త్వరలోనే వెండితెరపై చూసే అవకాశం ఉందంటూ ఖుషీ అవుతున్నారు. అనుష్క నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది స్వీటీ. ఈ స్పెషల్ క్వాలిటీ.. పరిశ్రమలో మిగతా హీరోయిన్ల నుంచి అనుష్కను వేరుచేసి ప్రత్యేకంగా నిలుపుతోంది. ‘అరుంధతి’.. ‘బాహుబలి’ ..‘భాగమతి’.. ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన అనుష్క.. రాబోయే సినిమా ఎవరితో చేస్తుందో చూడాలి. ఇక ఈ భామ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో ఉందని పలు రూమర్స్ వినిపించినా అవన్నీ రూమర్సేనని కొట్టిపడేశారు వీరిద్దరు. కేవలం తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారుకూడా.

సలార్ లో దిశాపటానీ, జాన్ అబ్రహం నిజమేనా?
3 hours ago

అమ్మడి అందాలు చూస్తే హార్ట్ బీట్ పెరగాల్సిందే..
4 hours ago

రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?
5 hours ago

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్
7 hours ago

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా
8 hours ago

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం
9 hours ago

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్
9 hours ago

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ
11 hours ago

మహేశ్ బాబు భార్య పోస్టుపై బుంగమూతి పెట్టుకున్న నిర్మాత
11 hours ago

త్రివిక్రమ్ తో ఈ డైరెక్టర్ కి అన్యాయం జరుగుతోందా
14 hours ago
ఇంకా