newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

'నిఖిల్' తో రొమాన్స్ చేయనున్న మలయాళ బ్యూటీ..

19-10-202019-10-2020 15:08:34 IST
2020-10-19T09:38:34.078Z19-10-2020 2020-10-19T09:38:31.714Z - - 26-11-2020

'నిఖిల్' తో రొమాన్స్ చేయనున్న మలయాళ బ్యూటీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు యంగ్ హీరో నిఖిల్ కి జోడీ కుదిరింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుందని ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది.  నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ..గీతాఆర్ట్స్2 బ్యానర్ లో రూపొందుతున్న 18 పేజేస్ మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. గత కొన్ని వారాలుగా నిఖిల్ మరియు కీలక యూనిట్ సభ్యులపై చిత్రీకరణ జరుగుతోంది.

ఈ చిత్రం షూటింగ్ లో తాజాగా క్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా జాయిన్ అయ్యింది. ఆమెకు చిత్ర యూనిట్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. సాదరణంగా అయితే హీరోయిన్ షూటింగ్ లో జాయిన్ అయితే హడావుడి ఏమీ ఉండదు. కాని ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ జాయిన్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో ఆమెకు సాదర స్వాగతం పలుకుతూ పోస్ట్ లు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనుపమాకి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో అనుపమా కర్లింగ్ హెయిర్..చక్కటి స్మైల్ తో సూపర్ గ్లామర్ తో మెరిసిపోయింది ఈ బ్యూటీ.  వెల్ కమ్ టు అబ్రాడ్ అని ఈ పోస్టర్ పై ఉంది.  నిఖిల్..అనుపమాల జోడీ సూపర్ అనే కామెంట్స్ కూడా అప్పుడే వినిపిస్తున్నాయి. 

మలయాళ బ్యూటీ అనుపమ 'ప్రేమమ్' సినిమాతో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మడి కెరీర్ నిదానంగా సాగుతోంది. కమర్షియల్ హిట్స్ వచ్చినా కూడా ఈమెకు తదుపరి సినిమా ఆఫర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. పెద్ద హీరోలతో నటించిన తర్వాత కూడా ఈమెకు మళ్లీ చిన్న హీరోల సినిమాల్లో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫర్లు లేకపోవడంతో వచ్చిన ఆఫర్లకు ఓకే చెబుతోంది. 18 పేజెస్ మూవీతో అయినా నటిగా మంచి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుని స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అవుతుందో చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle