newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ

07-05-202107-05-2021 12:03:28 IST
2021-05-07T06:33:28.655Z05-05-2021 2021-05-05T03:58:42.501Z - - 14-06-2021

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఓటీటీలో సందడి చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! హిందీలో వచ్చిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులో సినిమాను మాస్ కు కనెక్ట్ అయ్యేలా తీశారు. పవన్ కళ్యాణ్ హీరోయిజానికి కావాల్సిన ఫైట్స్, ఎలివేషన్స్ ను కూడా ఉండడంతో సినిమా సక్సెస్ బాట పట్టింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. 

అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్న ఈ సినిమాను చూసి పలువురు ప్రముఖులు సూపర్ అని మెచ్చుకుంటూ ఉన్నారు. నటి అనుపమా పరమేశ్వరన్ కూడా ఈ సినిమాను ఓటీటీలో చూసి సూపర్ గా ఉందని మెచ్చుకుంది. అయితే ప్రశంసించే సమయంలో అనుపమ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అనుపమ వకీల్ సాబ్ సినిమాపై చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో అందిరిని మెచ్చుకుంటూ నివేదా థామస్, అంజలి, అనన్యాలు అదరగొట్టారని తెలిపింది. ఇక నటుడు ప్రకాష్‌రాజ్‌ను 'సార్‌' అని సంభోదించిన అనుపమ.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం ట్విట్టర్ ఐడీని మాత్రమే మెన్షన్ చేసింది. పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇవ్వలేదన్నది పవర్ స్టార్ అభిమానుల అభిప్రాయం. దీంతో అనుపమను తిట్టడం మొదలు పెట్టారు. తప్పు జరిగిందే అని గమనించిన అనుపమ.. తను రియలైజ్ అయినట్లుగా పేర్కోంటూ సారీ చెప్పింది. మరోక ట్వీట్‌లో రాస్తూ.. 'పవన్ కళ్యాణ్ గారు'.. అంటే ఎంతో గౌరవం, ప్రేమ అని తెలిపింది. దీంతో పవన్ అభిమానులు అనుపమను ట్రోల్ చేయడం ఆపేశారు. తమ హీరోకు సారైనా గౌరవం ఇవ్వని వారిపై పవన్ కళ్యాణ్ అభిమానులు  గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

   an hour ago


హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

   2 hours ago


ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

   8 hours ago


పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

   13-06-2021


విజయ్ దేవరకొండ తన  ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

విజయ్ దేవరకొండ తన ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

   13-06-2021


దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

   12-06-2021


రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

   12-06-2021


ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

   12-06-2021


ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

   11-06-2021


వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..

   11-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle