newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

08-04-202108-04-2021 14:01:06 IST
Updated On 08-04-2021 12:39:28 ISTUpdated On 08-04-20212021-04-08T08:31:06.229Z08-04-2021 2021-04-08T06:28:00.723Z - 2021-04-08T07:09:28.176Z - 08-04-2021

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేంజ్ ఏంటో తెలుసు క‌దా. త్రిబుల్ ఆర్ మూవీతో ఎక్క‌డికో వెళ్ల‌బోతుంది క్రేజ్. ఇక త్రిబుల్ ఆర్ అనే విష‌యాన్ని వ‌దిలేస్తే.. త‌ను ఓ స్టార్ హీరో.. ఓ స్టార్ హీరో కొడుకు. మ‌రో స్టార్ హీరో.. త‌న‌కు బాబాయ్. అలాంటి రామ్ చ‌ర‌ణ్ ని ఎవ‌రైనా ప్రెయిజ్ చేస్తుంటారు. లేని పోనివి చెప్పి కూడా హిపోక్రసీలోకి నెట్టేస్తారు. మీరంతా మీరింతా అంటూ.. రామ్ చ‌ర‌ణ్ భ‌జ‌న చేయ‌డం మామూలే క‌దా. అఫ్ కోర్స్.. పెద్దింటి బిడ్డ‌.. పెద్ద స్టార్.. ఇంకేం కావాలి చెప్పండి.

Anupama parameswaran wallpaper by mallugang - 59 - Free on ZEDGE™

రామ్ చ‌ర‌ణ్ తో మూవీ అంటే.. బాలీవుడ్ స్టార్ లు కూడా రెడీ. ఎందుకంటే.. రామ్ చ‌ర‌ణ్ కి స్టార్ డ‌మ్ ఉంది. ఒక్క సినిమా చేస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఫుల్ పాపుల‌ర్ అయిపోతాం అనే క్లారిటీ ఉంది. కానీ.. అనుప‌మ మాత్రం లైట్ తీసుకుంది. అస‌లు ఆ రియాక్ష‌న్ ఏంటి త‌ల్లీ అంటున్నారు. మూతి మూడుచుకుని ఫోటో పెట్ట‌డం ఏంటి బేబీ అంటున్నారు. ఇండ‌స్ట్రీలో ఉందాం అనుకుంటున్నావా.. మానేద్దాం అనుకుంటున్నావా.. బాలీవుడ్ లో ఏమైనా ఆఫ‌ర్లు వ‌చ్చా పాపా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anupama Parameswaran Stills | Anupama | Photo 3 of 4

యాక్చువల్ గా బోర్ కొడుతోందంట పాప‌కి. ఆ టైంలో సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది. క్రేజీగా ఏమైనా క్వ‌శ్చ‌న్స్ ఉంటే అడ‌గండి ఆన్స‌ర్స్ ఇస్తా అంటూ అంద‌రినీ ఎంక‌రేజ్ చేసింది. ఆ టైంలో.. ఓ ఫ్యాన్ క్రేజీగా కాకుండా రెగ్యుల‌ర్ క్వ‌శ్చ‌న్ అడిగితే పాపేమో.. క్రేజీగా ఆన్స‌ర్ ఇచ్చింది.  మా చర‌ణ్ అన్న‌తో సినిమా చేస్తున్న‌వా బేబీ.. ఛాన్స్ వ‌స్తే చేస్తావా అని అడిగేశారు. ఆ టైంలో.. ఈ మూతి ముడుపు రియాక్ష‌న్ ఇచ్చింది.  చాలా లైట్ తీసుకున్న‌ట్లు  ఆన్స‌ర్ చేసింది. దీంతో.. త‌లో మాటా అనుకుంటున్నారు. ఆ మ‌ధ్య సుకుమార్ తో వచ్చిన రంగ‌స్థ‌లం మూవీలో ఫ‌స్ట్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ నే అనుకున్నార‌ట‌. కానీ.. త‌ర్వాత స‌మంతాని ఫైన‌ల్ చేశారు. సో.. మ‌న‌సులో ఏదో ఫీలింగ్ ఉండే ఉంటుంది అప్పుడు తీసేశార‌ని.. అందుకే.. ఇలా రియాక్ట్ అయింది అంటున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle