newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

వెంకీకి మ‌రో హిట్ రీమేక్ కి ఛాన్స్ దొరికింది

20-02-202120-02-2021 10:15:37 IST
Updated On 20-02-2021 09:49:07 ISTUpdated On 20-02-20212021-02-20T04:45:37.980Z20-02-2021 2021-02-19T19:47:57.879Z - 2021-02-20T04:19:07.590Z - 20-02-2021

వెంకీకి మ‌రో హిట్ రీమేక్ కి ఛాన్స్ దొరికింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వెంకీ అంటే రీమేక్.. రీమేక్ అంటే వెంకీ. తెలుగు ఇండ‌స్ట్రీలో.. ఈ విష‌యంలో వెంకీని ఎవ‌రూ బీట్ చేయ‌లేరు. అందులో ఎవ‌రికీ ఎలాంటి డౌట్లూ లేవు. ఇప్ప‌టికే రీమేక్స్ స్టార్ గా తెలుగు ఇండ‌స్ట్రీలో పేరుంది విక్ట‌రీ వెంక‌టేష్ కి. 

ఇప్పుడు ఇదే విక్ట‌రీ వెంక‌టేష్ కి మ‌రో రీమేక్ అవ‌కాశం ద‌క్కింది. అదే.. దృశ్యం సీక్వెల్. మ‌ళ‌యాలంలో సూప‌ర్ హిట్ అయిన మూవీని.. తెలుగులో వెంకీ రీమేక్ చేశాడు క‌దా. వెంక‌టీ న‌టించిన రీమేక్ కి కూడా మంచి పేరొచ్చింది. తెలుగులో దృశ్యం బంప‌ర్ హిట్ అయింది. ఒరిజిన‌ల్ మ‌ళ‌యాలం మూవీకి అక్క‌డ ఎంత పేరొచ్చిందో.. తెలుగులో కూడా వెంక‌టేష్ మూవీకి అంతే పేరొచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే మూవీ సీక్వెల్ రావ‌డంతో.. అంద‌రి ఇంట్ర‌స్టూ వెంకీ పై ప‌డింది.

ఆల్రెడీ.. దృశ్యం సీక్వెల్ కి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రివ్యూస్ కూడా బావున్నాయి. మొద‌టి దృశ్యాన్ని మించి ఉంది అంటున్నారు. ఫ‌స్ట్  పార్ట్ లో న‌టించిన మీనా, మోహ‌న్ లాల్ లే.. సీక్వెల్ లో కూడా న‌టించారు. సో.. తెలుగులో కూడా వెంకీ, మీనా న‌టిస్తే బంప‌ర్ హిట్ అవుతుంది అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. 

టాలీవుడ్ లో బ్ర‌ద‌ర్స్ హ‌వా..

ఇక పోతే.. వెంకీ రీమేక్ ల గురించి అంద‌రికీ తెలిసిందే క‌దా. ఆల్రెడీ ఇప్పుడు కూడా రీమేక్ మూవీనే చేస్తున్నాడు విక్ట‌రీ వెంక‌టేష్. త‌మిళ్ ఇండ‌స్ట్రీలో బంప‌ర్ హిట్ అయిన‌.. అసుర‌న్ అనే ధ‌నుష్ మూవీని.. తెలుగులో నార‌ప్ప అనే టైటిల్ తో రీమేక్ లో యాక్ట్ చేస్తున్నాడు విక్ట‌రీ వెంక‌టేష్. లుక్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏ రీమేక్ అయినా.. వెంక‌టేష్ విష‌యంలో ఫ్లాప్ టాక్ రాలేదు. సో.. నార‌ప్ప కూడా బంప‌ర్ హిట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌటూ లేదు.

ఇక‌పోతే.. దృశ్యం మూవీకి సీక్వెల్ ని రీమేక్ చేసినా.. హిట్ అవుతుంది. ఎందుకంటే.. మీనా కాంబినేష‌న్ లో వెంకీ అంటే.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎంతో ఇష్టం. చానాళ్ల త‌ర్వాత దృశ్యంలో చూశారు. ఇప్పుడు అదే సీక్వెల్ లో క‌నిపిస్తే.. ఇంకాస్త ఖుషీ అవుతారు. మ‌రి ఈ ఛాన్స్ తీసుకోవాలంటే కాస్త టైం ప‌ట్ట‌డం గ్యారంటీ. కానీ.. వెంకీని క్రాస్ చేసి.. ఈ ఛాన్స్ ఎవ‌రికీ పోక‌పోవ‌చ్చు అనేది ఆడియ‌న్ కాన్ఫిడెన్స్. ఎవ‌రూ అలాంటి డేర్ కూడా చేయ‌రు కావ‌చ్చు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle